AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు ఒక్కపూట న్యుడిల్స్ తిని రోజులు గడిపింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది తమ అందం అభినయంతో ఆకట్టుకుంటుంటే మరికొంతమంది కేవలం గ్లామర్ తోనే ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇంకొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొందరు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

అప్పుడు ఒక్కపూట న్యుడిల్స్ తిని రోజులు గడిపింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్..
Tollywoodnws
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2025 | 12:23 PM

Share

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం కొంచం కష్టమే.. కానీ కొంతమంది స్వయం కృషితో వచ్చి స్టార్స్ గా ఎదిగారు. కేవలం హీరోలే కాదు హీరోయిన్స్ కూడా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సత్తా చాటుతున్నారు. అలా వచ్చిన అమ్మడే ఈ హీరోయిన్.. తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోలకు సమానంగా ఫ్యాన్ బేస్ మాత్రమే కాదు.. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది ఈ భామ. సినిమా కెరీర్ లో స్టార్ గా రాణించిన ఆమె .. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంది. తాజాగా కెరీర్ బిగినింగ్ స్ట్రగుల్స్ ను గుర్తు చేసుకుంది. మోడలింగ్ నుంచి నటిగా మారిన ఆమె ఆ సమయంలో చాలీచాలని డబ్బుతోనే జీవితాన్ని కొనసాగించా అని తెలిపింది.

అంతే కాదు తినడానికి తిండి కూడా లేక న్యుడిల్స్ తిని రోజులు గడిపా అని తెలిపింది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇవే కష్టాలను చూసిందని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ భామ దియా మీర్జా. ఈ అమ్మడు మోడలింగ్ నుంచి నటిగా మారింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు తెలుగులోనూ ఈ అమ్మడు నటించింది. తన కెరీర్ లో పేరెంట్స్ సపోర్ట్ లేదు అని తెలిపింది. మిగతా హీరోయిన్స్ కు తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కానీ తాను మోడలింగ్ చేస్తున్న సమయంలో తల్లి దండ్రులు సపోర్ట్ లేదు అని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. 2000లో నేను, ప్రియాంకా చోప్రా, లారా దత్తా.. మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నాం.. అయితే ఆ సమయంలో ప్రియాంక చోప్రాకు తన తల్లి సపోర్ట్ చేశారు. కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ సమయంలో ముంబైలో లారా దత్తా ఇరుకు ఇంట్లో ఉండేది. ఆ ఇంట్లోనే నాకు ఉండేదుకు చోటు ఇచ్చింది. ఇద్దరం కలిసి అందులోనే సర్దుకునేవాళ్ళం.. ఫ్యాషన్ షోలో ఖరీదైన దుస్తులు వేసుకునేవాళ్ళం కానీ మా చేతిలో చిల్లు గవ్వ కూడా ఉండేది కాదు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అప్పట్లో న్యుడిల్స్ తిని రోజులు గడిపాము అని తెలిపింది దియా మీర్జా .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.