AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు రొమాంటిక్ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా విలన్.. ఇతగాడు ఎవరో కనిపెట్టారా.?

హీరోగానే కాదు.. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసి ప్రేక్షకులను మెప్పించగల నటుడు. తన ఇండస్ట్రీలోనే కాదు అన్ని భాషల్లో ఫెమస్ అయ్యాడు. అలాగే తెలుగులోనూ తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.?

అప్పుడు రొమాంటిక్ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా విలన్.. ఇతగాడు ఎవరో కనిపెట్టారా.?
Hero
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2025 | 12:47 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప నటులు ఉన్నారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఆ పాత్రను వాళ్ళు తప్ప మరొకరు చేయలేరు అనేంతగా ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన పాత్రలు చేస్తూ తామంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు చాలా మంది. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. విలక్షణ అన్న మాట వింటే ఆయన పేరే గుర్తొస్తుంది. ఇలా కూడా నటిస్తారా అని అందరూ షాక్ అవుతారు. చిన్న చిన్న సినిమాలనుంచి మొదలుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు ఆ హీరో.. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఓ పాత్ర చేస్తే అలా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇంత బిల్డప్ ఇస్తున్నాడు ఇంతకూ ఆయన ఎవరా అనుకుంటున్నారా..?

తండ్రి తోపు హీరో.. కూతురు మాత్రం మూడు సినిమాలకే కనిపించకుండా పోయింది.. ఆమె ఎవరంటే

మలయాళంలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు ఫహద్ ఫాజిల్.. సత్యరాజ్ నటించిన తమిళ రీమేక్ అయిన ‘ఎన్ బొమ్మకుట్టి అమ్మావుక్’ సినిమా లొకేషన్ నుంచి ఈ ఫోటోను తీశారు. ఇందులో సత్యరాజ్ ప్రధాన పాత్రలో కనిపించారు. డైరెక్టర్‏ ఫాజిల్ తెరకెక్కించిన కైయేతుం దూరత్ సినిమాతో ఫహద్ ఫాజిల్ సినీరంగ ప్రవేశం చేశారు. ఫస్ట్ మూవీ అంతగా మెప్పించలేదు..అయినా ఫహాద్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. పుష్ప నటుడు చిన్న వయసులోనే బాలనటుడిగా కనిపించాడు. 1992లో మమ్ముట్టి, శోభన నటించిన పప్పాస్ ఓన్ అప్పూస్ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ బాలనటుడిగా కనిపించాడు.

నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు..!! బాబోయ్..ఒంటరిగా చూడకూడని సినిమా.. ఏకంగా మూడు ఓటీటీలో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.ఇక ఇప్పుడు పుష్ప 2లో నటిస్తున్నాడు. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ నటిస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్ లో ఆయన పాత్ర ఎక్కువ సేపు ఉండదు. కనిపించింది కొంత సేపే అయినా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు.అలాగే పుష్ప 2లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు ఫహద్.

Bigg Boss 9: అనుకున్నదే అయ్యింది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనే.?

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us