తల్లి, కూతురు ఇద్దరి సరసన హీరోగా నటించిన ఏకంగా నటుడు.. ఆ హీరో, హీరోయిన్స్ ఎవరంటే
ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. హీరోలు, హీరోయిన్స్ వారసులు చాలా మంది ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే హీరోయిన్స్ చాలా మంది తండ్రి కొడుకులతో కలిసి నటించారు. కానీ ఓ హీరో మాత్రం తల్లి, కూతుర్లతో కలిసి నటించారు.

సినిమాల్లో చాలా మంది నటవారసులు ఉన్నారు. హీరోలు, హీరోయిన్స్ చాలా మంది తమ పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. చాలా మంది నటవారసులు సక్సెస్ కోసం చాలా మంది కష్టపడుతున్నారు. కొంతమంది వరుసగా సినిమాలు చేసినప్పటికీ కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తల్లి కూతురు ఇద్దరూ కలిసి హీరోయిన్స్ గా చేసిన సినిమా ఎదో తెలుసా.? ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ ఒక యుగాన్ని సృష్టించారు. ఆయన తిరుగులేని రికార్డులు నెలకొల్పి, సినిమా చరిత్ర గతిని మార్చారు. ఆయనతో నటించిన హీరోయిన్స్‌కు మంచి గుర్తింపు, భవిష్యత్తు లభించేది. ఎన్టీఆర్ తో నటించాలని నాటి నటీమణులు ఎంతగానో ఆశపడేవారు. ఎందుకంటే, ఎన్టీఆర్ ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా ఉండేవారు, ఆయనతో నటించడం ద్వారా నటనలో, క్రమశిక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని భావించేవారు. ఈ కారణాల వల్ల ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం హీరోయిన్స్ ఎదురుచూసేవారు.
ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు
నటి జయలలిత విషయంలోనూ సీనియర్ ఎన్టీఆర్ తో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. తమిళనాడులో హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో జయలలితకు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం లభించింది. ఆమె ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎన్టీఆర్, జయలలిత కలిసి నటించిన మొదటి చిత్రం గోపాలుడు భూపాలుడు. ఈ సినిమా తర్వాత వారిద్దరూ ఒక అందమైన జోడీగా పేరుపొందారు. ఆ తర్వాత శ్రీ కృష్ణ సత్య వంటి చిత్రంలో కూడా జయలలిత సత్యభామగా నటించగా, ఈ చిత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ నిర్మించడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్, జయలలిత కలిసి దాదాపు 11 చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్, జయలలితల జీవితాల్లో మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే, వారిద్దరూ సినిమా రంగంలో అగ్రతారలుగా వెలుగొందిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి, ముఖ్యమంత్రులుగా ప్రజలకు సేవలందించారు.
ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
ఈ ఇద్దరు మహానుభావులు ముఖ్యమంత్రులుగా కూడా తమదైన ముద్ర వేశారు. అయితే, చాలామందికి తెలియని ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సీనియర్ ఎన్టీఆర్ జయలలిత తల్లి సంధ్యతో కూడా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ మాయాబజార్, తెనాలి రామకృష్ణ వంటి ప్రఖ్యాత చిత్రాలలో జయలలిత తల్లి సంధ్యతో కలిసి నటించారు. ఇలా తల్లి సంధ్యతో పాటు కూతురు జయలలితతో కూడా హీరోగా నటించిన ఏకైక నటుడు సీనియర్ ఎన్టీఆర్. తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి అరుదైన ఘనత సాధించిన హీరోల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు అగ్రస్థానంలో నిలుస్తారు. ఎన్టీఆర్ రామారావు గారు జయలలిత గారితో, అలాగే ఆమె తల్లి సంధ్యతో కూడా కలిసి నటించడం ఒక అరుదైన రికార్డు.
ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




