AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ సోదరుడి మృతి.. మోడీ, రేవంత్‌లకు నటుడి ప్రత్యేక విజ్ఞప్తి.. ఏమైందంటే?

తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ దుర్వార్తను స్వయంగా రాహుల్ రామకృష్ణనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదే సందర్భంగా పీఎం మోడీ, సీఎం రేవంత్ లను ఒక రిక్వెస్ట్ కూడా చేశాడు.

Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ సోదరుడి మృతి.. మోడీ, రేవంత్‌లకు నటుడి ప్రత్యేక విజ్ఞప్తి.. ఏమైందంటే?
Rahul Ramakrishna
Basha Shek
|

Updated on: Mar 27, 2026 | 1:00 PM

Share

ఎన్నో సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన నటుడు రాహుల్ రామకృష్ణ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని సోదరుడు కన్నుమూయడంతో రాముల్ కృష్ణతో సహా అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పారాక్వాట్ అనే రసాయన గడ్డి మందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని రాహుల్ రామకృష్ణ ఎమోషనల్ అయ్యాడు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనాన్ని వెంటనే నిషేధించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఎం నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు రాహుల్ రామకృష్ణ. ‘పారాక్వాట్  అనే రసాయన గడ్డిమందు కారణంగా నా సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది అత్యంత విషపూరితమైన రసాయనం. కానీ ఇది మన తెలంగాణ రాష్ట్రంలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి నేను షాక్ కు గురయ్యాను. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారు.  చాలా మంది ఆత్మహత్యల కోసం ఈ మందును  విచ్చలవిడిగా దుర్వినియోగం  చేస్తున్నారు.  దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి . ప్రాణాలను కాపాడండి’ అని కోరాడు రాహుల్ రామకృష్ణ.

తన ట్వీట్ కు పీఎం నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయాలను ట్వీట్ చేశాడు రాహుల్ రామకృష్ణ.ప్రస్తుతం ఈ టాలీవుడ్ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాహుల్ రామకృష్ణ సోదరుడి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

రాహుల్ రామకృష్ణ ట్వీట్..

కాగా పారాక్వాట్ అనేది అత్యంత విషపూరితమైన కలుపు మందు. పొలాల్లో కలుపు మొక్కలను సులభంగా నాశనం చేయవచ్చన్న ఉద్దేశంతో రైతులు దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పత్తి లాంటి పంటల్లో పెరిగే కలుపు,   పొలాల గట్ల మీదున్న గడ్డిని నాశనం చేయడానికి ఈ మందును ఉపయోగిస్తున్నారు.  అయితే పారాక్వాట్ అత్యంత విషపూరితమని  వైద్యులు చెబుతున్నారు.  కొద్ది మోతాదులో తీసుకున్నప్పటికీ ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.  ఈ క్రమంలో చాలా మంది ఆత్మహత్యల కోసం ఈ మందును తాగి  ప్రాణాలు కోల్పోతున్నారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us