ఇంట్లో ఉంటూనే ఫిట్‌నెస్ గోల్ రీచ్ కావాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో కావడమే
ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా రోజుకు 10,000 అడుగులు నడవాలన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుత బిజీ లైఫ్, ఎండలు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల బయటకు వెళ్లి నడవడం చాలామందికి సాధ్యపడటం లేదు. అయితే చింతించకండి! ఫిట్‌నెస్ కోచ్ రీత్ కౌర్ చెబుతున్నట్లుగా, ఇంట్లోనే కేవలం 65 నిమిషాల్లో 10,000 అడుగుల లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. నిమిషానికి సగటున 167 అడుగులు వేయడం ద్వారా మీరు ఇంటి పట్టునే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

ఏ వ్యాయామం మొదలుపెట్టే ముందైనా శరీరాన్ని సిద్ధం చేయడం చాలా ముఖ్యం. మార్చ్ ఇన్ ప్లేస్, ఆర్మ్ స్వింగ్స్, మరియు తేలికపాటి సైడ్ స్టెప్స్ చేయడం వల్ల కండరాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల సుమారు 500 అడుగులు పూర్తవుతాయి. బోర్ కొట్టకుండా ఉండేందుకు ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు వ్యాయామం మార్చుకోవడం ఉత్తమం.
ప్రధాన వ్యాయామాలు (50 నిమిషాలు)
- హై-నీ మార్చింగ్ లేదా జాగింగ్ (10 నిమిషాలు)- చేతులను వేగంగా ఊపుతూ, పాదాలను తేలికగా ఉంచుతూ చేసే ఈ వ్యాయామం సుమారు 1,500 అడుగులను మీ ఖాతాలో వేస్తుంది. ఇది హృదయ స్పందన రేటును వేగంగా పెంచుతుంది.
- స్టెప్-అప్స్ (5 నిమిషాలు)- ఏదైనా స్టడీగా ఉన్న కుర్చీ లేదా మెట్ల సాయంతో కాళ్లను మారుస్తూ ఎక్కడం వల్ల కాళ్లకు మంచి బలం చేకూరుతుంది. ఇది సుమారు 800 అడుగులకు దోహదపడుతుంది.
- డాన్స్ లేదా జుంబా (10 నిమిషాలు)- మీకు నచ్చిన ఉత్సాహభరితమైన సంగీతం పెట్టుకుని స్వేచ్ఛగా కదలండి. ఇది అత్యంత సరదాగా 1,500 అడుగులను దాటించేస్తుంది.
- వాక్-అండ్-లంజ్ కాంబో (5 నిమిషాలు)- 10 అడుగులు నడిచి, ఐదు లంజ్లు చేయడం వల్ల లోయర్ బాడీకి మంచి వ్యాయామం అందుతుంది. ఇది సుమారు 500 అడుగులు ఇస్తుంది.
- సైడ్ స్టెప్స్ విత్ స్కేటర్ జంప్స్ (5 నిమిషాలు)- వెడల్పాటి అడుగులు మరియు చిన్న చిన్న జంప్‌లతో కోర్ కండరాలను బలోపేతం చేయండి. దీనివల్ల 800 అడుగులు పూర్తవుతాయి.
- స్టెయిర్ క్లైంబింగ్ లేదా మార్చింగ్ ఇంటర్వెల్స్ (10 నిమిషాలు)- మెట్లు ఎక్కడం లేదా వేగంగా మార్చింగ్ చేయడం ద్వారా 2,000 అడుగులను సులభంగా పూర్తి చేయవచ్చు.
కూల్ డౌన్ (5 నిమిషాలు)
చివరగా, నెమ్మదిగా నడవడం, లోతైన శ్వాస తీసుకోవడం, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చివరి 500 అడుగులను పూర్తి చేయడంతో పాటు, మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే, జిమ్‌కి వెళ్లే సమయం లేకపోయినా, ఇంట్లోనే ఉంటూ పూర్తి ఫిట్‌నెస్ సాధించవచ్చు. ఆరోగ్యకరమైన ప్రయాణం చిన్న అడుగులతో మొదలవుతుందని గుర్తుంచుకోండి!
