స్వీటీ సినిమా కోసం ఈగర్‌గా ఎదురుచుస్తున్న ఫ్యాన్స్..   

Rajeev 

31 May  2026

instagram

హీరోయిన్ అనుష్క శెట్టి. దక్షిణాదిలో టాప్ హీరోయిన్. నాగార్జున, సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాత అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో జేజమ్మ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. 

ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. మధ్యలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసింది. 

చాలా కాలం తర్వాత ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.  కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం అనుష్క కథానార్ అనే సినిమా చేస్తుంది. కానీ ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.