నా వల్లే అతనికి ఆ పేరొచ్చింది.. ఆసక్తికర విషయం పంచుకున్న దర్శకుడు తేజ
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన తేజ ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఉదయ్ కిరణ్ తో చిత్రం, నువ్వునేను, నితిన్ తో జయం వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలను ఆడియెన్స్ కు అందించాడు తేజ.

దర్శకుడు తేజ గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత సిద్ధాంతాలు, పరిశ్రమ అనుభవాల గురించి వివరంగా చర్చించారు. తన ముక్కుసూటి స్వభావానికి పేరుగాంచిన తేజ, ఎవరైనా తనను కొట్టడానికి ప్రయత్నిస్తే, ఆ పరిస్థితిని ముందుగానే చక్కదిద్దుతానని, చేతిని పైకి లేపనివ్వనని చెప్పారు. రానా దగ్గుబాటితో తన తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ, అది “నేనే రాజు నేనే మంత్రి”కి సీక్వెల్ కాదని స్పష్టం చేశారు. ఈ కొత్త ప్రాజెక్టు రాక్షస రాజు 1960ల నేపథ్యంలో సాగే యాక్షన్, క్రైమ్, ఫ్యామిలీ డ్రామా అని వివరించారు. రానా తన అభిమాన నటుడని, తమ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందని, రానా తాను కోరుకున్న అవుట్‌పుట్‌ను కచ్చితంగా అందిస్తాడని ప్రశంసించారు. భావోద్వేగ సన్నివేశాల కోసం నటులను గిల్లి, మానసికంగా సిద్ధం చేసే తన పద్ధతులను కూడా పంచుకున్నారు. కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం గురించి మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు 1163 మంది నటీనటులను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే పరిచయం చేశానని, బలగం చిత్ర దర్శకుడు వేణు వంటి వారిని కూడా ప్రోత్సహించానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే
హీరోయిన్ల ఎంపికలో తన ప్రత్యేక విధానాన్ని వివరిస్తూ, సంప్రదాయ సౌందర్యానికి బదులుగా పాత్రకు సరిపోయే నటిని ఎంచుకుంటానని, అందానికి ఎవరూ నిర్వచనం ఇవ్వలేరని, ఆడియన్స్‌కు కావాల్సిన ఎమోషన్‌ను ఇవ్వడమే ముఖ్యమని తేజ అభిప్రాయపడ్డారు. జేడీ చక్రవర్తి పేరు వెనుక ఉన్న కథను కూడా ఆయన వెల్లడించారు. “శివ” సినిమాకు కథ రాసేటప్పుడు తన పూర్తి పేరు “జై ధర్మ తేజ” నుండి “జేడీ”ని తీసుకుని ఆ క్యారెక్టర్‌కు పెట్టానని, ఆ తర్వాత అది జేడీ చక్రవర్తిగా మారిందని చెప్పారు. శివ చైన్ హ్యాండ్ పోస్టర్ ఐడియా కూడా తనదేనని తేజ అన్నారు.
ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్
సినీ పరిశ్రమలో కథల కాపీయింగ్ గురించి మాట్లాడుతూ, తన కథలను కాపీ చేయడం కష్టమని చెప్పారు. రైటర్స్ యూనియన్‌లో కథలను రిజిస్టర్ చేయడం ద్వారా కథలు లీక్ అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. చివరగా, తన చిత్రాలలో కనిపించే “ప్యూర్ లవ్” అంశం తన బలం అని అంగీకరించారు. “నేనే రాజు నేనే మంత్రి”లో అదనపు వైవాహిక సంబంధం ఉన్నప్పటికీ, నాయకుడు తన భార్యను ఎంతగానో ప్రేమించడాన్ని ఉదాహరణగా చూపారు. తన సినిమాలు కేవలం ప్రేమను మాత్రమే కాకుండా, విలనీ, కామెడీలలో కూడా డెప్త్ ఉంటాయని తేజ అన్నారు.
ఇది కూడా చదవండి : ప్రివ్యూ చూసి ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అన్నారు..! కట్ చేస్తే ఇండస్ట్రీలోనే క్లాసిక్ హిట్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




