AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

56ఏళ్ల హీరోతో 20ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా..

సినిమాల్లో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ తమకన్నా చిన్న వయసున్న వారితో లేదంటే తనకన్నా వయసులో పెద్దవారితో నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ తమకన్నా వయసులో 10 ఏళ్లు, 20 ఏళ్లు పెద్ద వారితో నటించి మెప్పిస్తున్నారు.

56ఏళ్ల హీరోతో 20ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా..
Tollywood Movie
Rajeev Rayala
|

Updated on: Mar 26, 2026 | 9:30 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఏజ్ గ్యాప్ అనేది అనవసరమైన టాపిక్. హీరో, హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్ అనేది చాలా కామన్. చాలా మంది హీరోలు తమకన్నా వయసులో చాలా చిన్న వయసున్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేశారు. అంతే కాదు కూతురు వయసున్న హీరోయిన్స్ సరసన కూడా సినిమాలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే.. 56ఏళ్ల హీరోతో 20ఏళ్ల హీరోయిన్ నటించి అందరికి షాక్ ఇచ్చింది. అంతే కాదు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇంతకూ ఆ హీరో, హీరోయిన్ ఎవరో.? ఆ సినిమా ఎదో తెలుసా.? నందమూరి తారక రామారావు నటించిన డ్రైవర్ రాముడు చిత్రం 1979 ఫిబ్రవరి 2న విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, ఎన్టీఆర్ కెరీర్‌లోని 265వ చిత్రంగా గుర్తింపు పొందింది.

మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా

56 ఏళ్ల వయసులో ఎన్టీఆర్, అప్పటి 20 ఏళ్ల జయసుధతో కలిసి రొమాంటిక్ పాత్రలో నటించడం అప్పట్లో విశేష చర్చకు దారి తీసింది. దాదాపు 35 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ, వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై అద్భుతంగా పండింది. ఈ సినిమా నిర్మాణ వేగం ఆశ్చర్యకరం. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కేవలం 28 రోజుల్లో, మూడు షెడ్యూల్లలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారట. రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాలకు ఎన్టీఆర్ స్వయంగా రోడ్లు వేయించి, సినిమా చిత్రీకరణకు సహకరించారట. 1978 అక్టోబర్ నుంచి 1979 ఏప్రిల్ మధ్య మూడు చిత్రాలు విడుదల చేయాలనే ఎన్టీఆర్ సంకల్పంలో భాగంగా డ్రైవర్ రాముడు ఒక కమర్షియల్ చిత్రంగా రూపొందించారట.

OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..

ఎన్టీఆర్ సొంత బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రానికి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. కె. రాఘవేంద్రరావుకు నందమూరి వారి బ్యానర్‌లో ఇది తొలి చిత్రం. లారీ డ్రైవర్ పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. రోజారమణి, శ్రీధర్, కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు, రావు గోపాలరావు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డ్రైవర్ రాముడు విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి దాని కథనం, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డైలాగులు, జంధ్యాల రాసిన కామెడీ పంచ్‌లు. చక్రవర్తి అందించిన సంగీతం, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం, బాలు గానం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌ను బలంగా చూపించి ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. బాక్సాఫీస్ వద్ద డ్రైవర్ రాముడు సంచలనం సృష్టించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరుతో సహా పలు కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తిరుపతిలో 25 వారాలు, విజయవాడలో షిఫ్టింగ్‌లతో 25 వారాలు ఆడింది. సెకండ్ రిలీజ్‌లో కూడా సినిమా విజయవంతమైంది.

ఇవి కూడా చదవండి

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం