AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : చికిరి చికిరి సాంగ్‌లో కనిపించిన ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా.?

ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ చరణ్. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అంతే కాదు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Peddi Movie : చికిరి చికిరి సాంగ్‌లో కనిపించిన ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా.?
Peddi
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2026 | 12:03 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రెటీలు, అభిమానులు ఆయనకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని. రామ్ చరణ్ ఒక ‘ఆట కూలీ’ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో టీజర్ ను విడుదల చేశారు.  ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మొదటి సాంగ్ చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈసాంగ్ లో చరణ్ డాన్స్ తో అదరగోట్టారు. అలాగే జాన్వీ తన అందాలతో కవ్వించింది. పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సాంగ్..ఇదిలా ఉంటే చికిరి చికిరి.. సాంగ్ లో కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చికిరి చికిరి పాటలో జాన్వీ పక్కన ఫ్రెండ్ రోల్ లో కనిపించిన ఈ చిన్నదనికి కోసం నెటిజన్స్ గాలిస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఆమె పేరు శ్వేతా సలురు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us