AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ గొప్ప మనసు.. అడగ్గానే ఆ డ్యాన్స్ మాస్టర్‌కు 40 లక్షలు ఇచ్చేసిన మెగా పవర్ స్టార్

సినిమాలు, నటన విషయంలో తన తండ్రి చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుంటాడు చిరంజీవి. అలాగే సేవా గుణంలోనూ మెగాస్టార్ నే ఫాలో అవుతుంటాడీ మెగా పవర్ స్టార్. ఆపదలో ఉన్న వారికి వెంటనే ఆపన్న హస్తం అందించే గొప్ప మనసు రామ్ చరణ్ ది.

Ram Charan: రామ్ చరణ్ గొప్ప మనసు.. అడగ్గానే ఆ డ్యాన్స్ మాస్టర్‌కు 40 లక్షలు ఇచ్చేసిన మెగా పవర్ స్టార్
Ram Charan
Basha Shek
|

Updated on: Mar 27, 2026 | 11:33 AM

Share

మెగా పవర్ స్టార్, హీరో రామ్ చరణ్ ఇవాళ (మార్చి 27) తన పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ మెగా హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక అభిమానులు చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నదానం, రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా గురువారం (మార్చి 26) ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులతో పాటు మెగాభిమానులు పెద్ద ఎత్తన ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ వేడుకల్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆయన ఎంతోమందికి సాయం చేశారని ఆయన ఇండస్ట్రీలో ఉండటం అందరి అదృష్టమని కొనియాడారు జానీ మాస్టర్.

‘ డ్యాన్సర్లు ఎంత కష్టపడతారో మా రామ్ చరణ్‌ అన్నకు తెలుసు. అందుకే వాళ్లకు ఇన్సూరెన్స్‌ చేయిస్తా అని గతేడాది చెప్పారు. దానికోసం అడగ్గానే 40 లక్షలు ఇచ్చారు. ఇది డబ్బు మాత్రమే కాదు.. 600 కుటుంబాల ఆరోగ్యం. కనీసం 2000 మందికి ఇన్సూరెన్స్ చేయించారు. ఈ రోజుల్లో 40 రూపాయలు ఇవ్వడమే కష్టం. అలాంటిది ఇన్ని లక్షలు అడగ్గానే ఇవ్వడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. డ్యాన్సర్స్‌ యూనియన్‌ మొత్తం చరణ్ అన్నకు రుణపడి ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తిని మాకు అందించిన మెగాస్టార్ చిరంజీవిని ఎప్పటికీ మర్చిపోలేం. ట్యాలెంట్‌ ఉన్న వాళ్లను ప్రోత్సహించడంలో చరణ్‌ ముందుంటారు. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటారు. దానికి నేనే ఉదాహరణ’ అని జానీ మాస్టర్‌ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఉప్పెన తో జాతీయ అవార్డు అందుకున్న బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తుండడం. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి పెద్ది సినిమా థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. అయితే అనూహ్యంగా వాయిదా పడింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకల్లో జానీ మాస్టర్ స్పీచ్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us