పాన్ ఇండియా బ్యూటీస్‌కి కొత్త కష్టాలు
గతంలో స్టార్ లీగ్ లో ఉన్న బ్యూటీస్ కే పాన్ ఇండియా ఆఫర్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్దగా ట్రెండ్ లో లేని బ్యూటీస్ కూడా భారీ చిత్రాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఆ సినిమా సక్సెస్ అయితే సరే, లేదంటే వాళ్ల కెరియర్ కష్టాల్లో పడిపోతోంది. ఈ మధ్య కాలంలో ఇలా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో కనిపించి కూడా ఫామ్ లోకి రాలేకపోయిన అందాల భామలు చాలా మందే కనిపిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరిచారు. దీంతో ఈ సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్ లోకి అడుగు పెట్టిన అందాల భామలకి కూడా నిరాశే ఎదురైంది. ముఖ్యంగా టాలీవుడ్ డెబ్యూ మీద భారీ ఆశలు పెట్టుకున్న మాళవికా మోహనన్ కి గట్టి షాక్ తగిలింది. ది రాజా సాబ్ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నిధి అగర్వాల్ ని బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు నిరాశపరిచాయి. పవన్ కు జోడిగా నటించిన హరిహర వీరమల్లుతో తన రేంజ్ మారిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ది రాజా సాబ్ అయినా కెరియర్ ని గాడిలో పెడుతుందేమో అనుకుంటే ఆ సినిమా కూడా షాక్ ఇచ్చింది. దీంతో నిధి కెరియర్ డైలమాలో పడిపోయింది. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీనిధి శెట్టి పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. తొలి సినిమా నేషనల్ సెన్సేషన్ అయినా ఆ తరువాత అదే జోరు కంటిన్యూ చేయడంలో తడబడుతున్నారు ఈ బ్యూటీ. దీంతో అప్ కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు. వీళ్లలో ఒక్క రుక్మిణి వసంత్ మాత్రమే మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. టాక్సిక్, ఎన్టీఆర్-నీల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

