Year Ender 2024: రేయ్ ఎవర్రా మీరంతా..!! ఈ హీరోయిన్ కోసం గూగుల్‌లో తెగ గాలించారంట మావా..
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది ఈ అమ్మడు. ఆ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు తన అందాలతో కుర్రాళ్లను కవ్వించింది. ఇంకేముందు నెటిజన్స్ ఊరుకుంటారా.. గుగూల్ లో తెగ గాలించారు. కట్ చేస్తే 2024లో ఎక్కువ మంది గూగుల్ లో వెతికిన హీరోయిన్ గా నిలిచింది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరంటే..
2024కు త్వరలోనే గుడ్ బై చెప్పనున్నాం. ఇక ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలా సంఘటనలు జరిగాయి. ఊహించని విధంగా కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇంకొంతమంది విడాకులు తీసుకున్నారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డారు. అదేవిధంగా మరికొంతమంది భామలు స్టార్ డమ్ కూడా తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సర్చ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఆ భామ.. పైగా ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కూడా కాదు అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా.. ఒకేఒక్క సినిమా ఈ అమ్మడి కెరీర్ ను టర్న్ చేసింది. ఆ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో ఆమె కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించారు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ
చాల మంది హీరోయిన్ ఈ మధ్య ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాగే యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అర్జున్ రెడ్డి రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేశాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో చాలా మంది నటించి ఆకట్టుకున్నారు.
ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి
అలాగే ఈ మూవీ కీలక పాత్రలో త్రిప్తి డిమ్రీ కూడా నటించింది. ఆమె కనిపించింది కొంత సేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యానిమల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ భామ. యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీ పేరు మారుమ్రోగింది. ఎక్కడ చూసిన ఈ అమ్మడి గురించే మాట్లాడుకున్నారు. యానిమల్ సినిమా హిట్ అవ్వడంతో త్రిప్తి డిమ్రీ కి ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఇదే ఏడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలైయా 3 అనే సినిమాల్లో చేసింది. బ్యాడ్ న్యూజ్ సినిమాలో అందాలతో అదరగొట్టింది త్రిప్తి డిమ్రీ. దాంతో ఈ బ్యూటీకోసం గూగుల్ లో నెటిజన్స్ తెగ గాలించారు. అలా ఈ అమ్మడు మోస్ట్ గూగుల్ సర్చ్డ్ హీరోయిన్ గా టాప్ లో నిలిచింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.