AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనను గెలకడం వల్లే ఇండస్ట్రీలో కలకలం మొదలైంది అని వేణు స్వామి అన్నారు. ఇండస్ట్రీలో నాలుగు పెద్ద సంఘటనలు జరగడం మీ జీవితంలో ఎప్పుడైనా చూశారా..? అని వేణు స్వామి అన్నారు.

Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి
Venu Swamy
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2024 | 3:57 PM

Share

వేణు స్వామి .. పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు ఇది. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు ఈయన. సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. ఇలా చిక్కుల్లో పడ్డ వేణు స్వామి కొన్ని రోజులు సైలెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ ముందు ప్రత్యక్షం అయ్యారు.

ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు

రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు వేణు స్వామి ఇంటర్వ్యూలు ఇచ్చారు. దానిలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా మాట్లాడారు. అంతే కాదు తన పై విమర్శలు చేసినందుకే ఇండస్ట్రీ చిక్కుల్లో పడింది అని అన్నారు ఈ గురువుగారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

మనం వేణు స్వామిని గెలికినప్పటి నుంచే ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యిందని ఆలోచించాలి. రేపు 2025 మార్చ్ నుంచి రాజకీయాల్లో పెను సంచలనాలు జరగనున్నాయి ఇది ఆలోచించాలి. తెలుగు చిత్రపరిశ్రమ గింగిరాలు తిరుగుతుంది అని నేను ఓ ఇంటర్వ్యూలో చెప్పినా.. ఇలాంటి నాలుగు పెద్ద సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా చూశారా.? ఓ స్టార్ హీరో కన్వెన్షన్ కూల్చేయడం.. ఓ పెద్ద దర్శకుడు.. భారతదేశానికే పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ చేయడం, పాన్ ఇండియా హీరోను జైల్లో పెట్టడం. 70ఏళ్ల చరిత్ర ఉన్న నటుడి ఇంట్లో గొడవలు.. ఇవన్నీ ఎప్పుడైనా చూశారా..? నేను ఎప్పుడో ఆగస్టులోనే ఇదంతా చెప్పా.. ఇంకా చాలా జరుగుతాయి అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే అల్లు అర్జున్ సీఎం అవుతాడు అని కూడా కామెంట్స్ చేశారు వేణు స్వామి.

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.