సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు
నాగ చైతన్య సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి వివాహం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ వివాహానికి కొద్దిమంది సినీ సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు. కాగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సినిమాలతో బిజీ అయ్యింది. అలాగే మాయోసైటిస్ బారిన పడటంతో ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంది.
అక్కినేని నాగ చైతన్య పర్సనల్ లైఫ్ వార్తల్లోఎక్కువగా నిలుస్తుంది. నాగ చైతన్య ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమంత నాగ చైతన్య నటించిన ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆతర్వాత చాలా కాలం ప్రేమలో మునిగితేలారు. అలాగే కలిసి సినిమాలు కూడా చేశారు. ఇక ఈ ఇద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ టాలీవుడ్ స్టార్ కపుల్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ ఇద్దరూ విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. 2022లో సామ్, చైతన్య విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఆతర్వాత ఈ ఇద్దరి గురించి చాలా వార్తలు వచ్చాయి.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!
విడిపోయిన తర్వాత చైతన్య తన సినిమాలతో బిజీ అయ్యాడు. సామ్ కూడా సినిమాలు చేసింది. ఆతర్వాత మాయోసైటిస్ బారిన పడింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే సామ్ రికవర్ అవుతుంది. అలాగే సినిమాలతో బిజీ అవుతుంది. ఇక నాగ చైతన్య రీసెంట్ గా శోభిత దూళిపాళ్లను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గానే వీరి వివాహం జరిగింది. అయితే ఇప్పుడు సమంత, శోభిత ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట
సమంత దాదాపు 15 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ అమ్మడి ఆస్తులు దాదాపు రూ. 101కోట్లు వరకు ఉన్నాయి. అంతే కాదు సమంత కొన్ని యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. వీటితో పాటు సఖీ అనే క్లాతింగ్ బ్రాండ్, ఏకం స్కూల్ కూడా ఉన్నాయి. ఇలా సామ్ రెండు చేతుల సంపాదిస్తున్నారు. కాగా శోభిత దూళిపాళ్ల 8ఏళ్లుగా సినిమా ఇండస్త్రీలో ఉన్నారు. ఈ చిన్నది దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయిలు సంపాదించిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాగ చైతన్య ఆస్తులతో కలిపితే అంటే రూ. 154 కోట్లు కలిపితే ప్రస్తుతం ఆమెకు 164 కోట్ల ఆస్తులు ఉన్నాయని అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక శోభిత, చైతన్య పెళ్లి తర్వాత ఆలయాలను సందర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి : బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?
సమంత ఇన్ స్టా..
View this post on Instagram
శోభిత ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.