AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Aravind: ‘అందుకే అల్లు అర్జున్ ఆస్పత్రికి రావట్లేదు’.. కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

పుష్ప 2 ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రా బాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు వారాలుగా ఇక్కడే ఉన్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది పుష్ప 2 చిత్ర బృందం.

Allu Aravind: 'అందుకే అల్లు అర్జున్ ఆస్పత్రికి రావట్లేదు'.. కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్
Allu Aravind
Basha Shek
|

Updated on: Dec 18, 2024 | 5:16 PM

Share

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించాడు. బుధవారం (డిసెంబర్ 18) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ బాలుడి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ ఆస్పత్రికి రాలేకపోయారని వివరించారు. అర్జున్‌ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని, బన్నీ కూడా త్వరలోనే వచ్చి బాలుడిని పరామర్శిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

కాగా మంగళవారం (డిసెంబర్ 18) రాత్రి శ్రీ తేజ్ ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ‘ శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతని జ్వరం పెరుగుతోంది. మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్‌లను కూడా బాగానే తట్టుకుంటున్నాడు. అలాగనీ అతను పూర్తిగా హెల్దీగా ఉన్నాడని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ దృష్ట్యా.. వెంటి లేటర్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. శ్రీతేజ్‌కు మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నాం’ అని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా ఆస్పత్రిలో పిల్లాడికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు పుష్ప 2 చిత్ర బృందం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్ కూడా తెప్పించారు. ఇక ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్‌, మైత్రీ నిర్మాతలు, హీరో అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ ఎప్పటికప్పుడూ శ్రీతేజ్‌ హెల్త్ అప్ డేట్స్ ను తెలుసుకుంటున్నారు.  ముఖ్యంగా నిర్మాత బన్నీవాస్‌ తరుచుగా ఆస్పత్రికి వస్తూ శ్రీతేజ్‌ యోగాక్షేమాలు తెలుసుకుంటున్నారు.

శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి