Prasad Behara: యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్.. లైంగికంగా వేధించాడని ఫిర్యాదు
యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలోఅసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహరాను రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహరాతో కలిసి వెబ్ సిరీస్ ల్లో నటించింది.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!
షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంటూ యువతీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహరపై 75(2), 79, 351(2)BNS, సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహరా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహరా నటిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహరా.. కామెడీ సిరీస్ లు చేస్తూ యూట్యూబ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట
ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పని చేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడటం, షూటింగ్ లో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు.
ఇది కూడా చదవండి : బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.