Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..
దర్శక ధీరుడి రాజమౌళి డైరెక్షన్‌లో చేయాలనీ ఎవరికీ మాత్రం ఉండదు. చిన్న పాత్ర అయినా సరే అవకాశం వస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అపజయం అంటూ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. కానీ ఓ హీరోయిన్ మాత్రం రాజమౌళితో సినిమా అంటే నో అని చెప్పిందట.. కేవలం రెమ్యునరేషన్ కోసం.. ఆమె ఎవరంటే
తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ బ్రాండ్. అపజయాలు ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ అగ్ర దర్శకుడిగా మారారు రాజమౌళి. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలనీ ఎవరికీ ఉండదు చెప్పండి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రాజమౌళి సినిమాలో చేయడానికి బేరాలాడిందట. రెమ్యునరేషన్ సెట్ అవ్వకపోవడంతో నో చెప్పిందట. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను మార్చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా చేయను అని చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా.? రాజమౌళి అడగాలే కానీ హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సినిమా చేయడానికి రెడీ అవుతారు. కానీ ఓ టాలీవుడ్ హీరోయిన్ కేవలం రెమ్యునరేషన్ కారణంగా ఆయన సినిమాను రిజెక్ట్ చేసిందట.
ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట
ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించారు శ్రీదేవి. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది ఈ అందాల తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఆ దివంగత నటి. అయితే శ్రీదేవికి రాజమౌళి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడట. కానీ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్ కు నో చెప్పారట శ్రీదేవి. ప్రభాస్ హీరోగా బాహుబలి రాజమౌళి తెరకెక్కించిన సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవి సంప్రదించారట. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట జక్కన్న. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి రూ.8 కోట్లు డిమాండ్ చేశారట. అలాగే సినిమాలో షేర్ కూడా అడిగారట. వీటితోపాటు ఆమె హోటల్ బిల్లులు, ఫైట్ ఛార్జ్ లు అన్ని కలుపుకొని దాదాపు రూ. 15కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ.. ఆ వార్తల్లో నిజం లేదు అని అన్నారు.