అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ

ప్రపంచ అందాల పోటీ‌లో భారతీయ యువతి విశ్వ సుందరిగా ఎంపికై కీర్తీ పతాకాన్ని ఎగురువేసింది. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ విశ్వసుందరి పోటీలలో 21 సంత్సరాల వయసులో భారత్ తరుఫున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతిగా పేరు పొందింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? కెరీర్ బిగినింగ్ లో బాడీ షేమింగ్ కు గురైంది.. కానీ ఇప్పుడు..

అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 19, 2024 | 7:37 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఫిట్ గా ఉంటూ.. గ్లామర్‌ను మెయింటెన్స్ చేస్తూ ఉంటారు. నిత్యం జిమ్ లో తెగ కష్టపడుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్ సినిమాల కోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. పాత్రల కోసం బరువు పెరుగుతూ ఉంటారు అలాగే స్లిమ్ గా మారుతూ ఉంటారు. అయితే చాలా మంది హీరోయిన్ విమర్శలు ఎదుర్కొని ఆతర్వాత స్టార్స్ గా మారారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. దారుణంగా బాడీ షేమింగ్ బారిన పడింది. ఆతర్వాత ఊహించని విధంగా ఆమె స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఆమెను చూస్తే ఎలాంటి కుర్రాడైన ప్రేమలో పడిపోవాల్సిందే.. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..? కెరీర్ బిగినింగ్ లో బాడీ షేమింగ్ కు గురయ్యింది. ఇప్పుడు ఆమె అందానికి సినీ లవర్స్ అంతా నోరెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

బాలీవుడ్ లో ఎంతో మంది అందాల భామలు తెరపైకి వస్తున్నారు.వారిలో హర్నాజ్ కౌర్ సంధూ ఒకరు. ఇజ్రాయెల్‌లోని  ఐలాట్‌లో జరిగిన 70వ విశ్వసుందరి పోటీలలో 21 సంత్సరాల హర్నాజ్ కౌర్ సంధూ విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. భారత్ తరుఫున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతిగా పేరు పొందింది ఈ ముద్దుగుమ్మ. హర్నాజ్​ సంధూ 2000 సంవత్సరంలో చండీగఢ్​లో జన్మించింది. 17 ఏళ్ల వయసులో మోడలింగ్​ కెరీర్​ ప్రారంభించింది. అదే ఏడాది మిస్ చంఢీగడ్ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2018లో మిస్​ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా-2018 టైటిల్​ను అందుకుంది.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

అందాల పోటీల్లో పాల్గొనే సమయంలో ఈ చిన్నది బరువు పెరిగిపోయింది. ఆ సమయంలో ఆమె పై చాలా మంది విమర్శలు చేశారు. బాడీ షేమింగ్ తో పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత 2021లో మిస్ యూనివర్స్ గా నిలిచింది. నేను నన్ను నమ్ముకొన్నాను కాబట్టే.. ఈ రోజు సక్సెస్ అయ్యాను అని తెలిపింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సన్నజాజిలా మారి కనువిందు చేస్తుంది. ఆ తర్వాత ఈ చిన్నది పంజాబీలో పలు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు బాగీ4 సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.  ఇక ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు

Harnaaz Sandhu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.