ఒకే హోటల్ గదిలో హీరో, హీరోయిన్.. నిర్మాతకు డబ్బులు మిగల్చడానికేనట..!!
హాలీవుడ్ సినిమాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో హాలీవుడ్ సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. సూపర్ మ్యాన్ సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయి. స్పైడర్ మ్యాన్ సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా హీరో టామ్ హాలండ్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు.
హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ హాలండ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం టామ్ హాలండ్ వయసు 28 ఏళ్లు. ఇంగ్లండ్‌లో పుట్టిన అతనికి హాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆయనతో సినిమా చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు గ్రహీత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమాలో టామ్ హాలండ్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హామ్ హాలండ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఒక హీరోయిన్ తో తాను హోటల్ గదిని షేర్ చేసుకున్నా అని చెప్పాడు.
ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట
హాలీవుడ్ బ్యూటీ జెండయా గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. స్పైడర్ మ్యాన్ సిరీస్ లో ఈ చిన్నది టామ్ హాలండ్‌తో కలిసి నటించింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారు. అయితే వీరిద్దరినీ ఒకే సినిమాలో ఎంపిక చేస్తే నిర్మాతలకు బాగా లాభం చేకూరుతుందట. ఎందుకంటే టామ్ హాలండ్ జెండయాతో హోటల్ గదిని షేర్ చేసుకుంటాడట. అందుకే ఈ జోడీని నిర్మాతలు ఎంపిక చేస్తారనే జోక్ హాలీవుడ్ లో తెగ వినిపిస్తుంది..
ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట
అయితే టామ్ హాలండ్ ఇలా హీరోయిన్లందరితో రూమ్ షేర్ చేసుకోడు. కేవలం జెండయాతో మాత్రమే! ఎందుకంటే జెండయా, టామ్ హాలండ్ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారు. ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అందుకే కొత్త సినిమాలో కలిసి నటిస్తే షూటింగ్ సమయంలో ఇద్దరికీ ఒక హోటల్ రూమ్ బుక్ చేస్తే సరిపోతుందని టామ్ హాలండ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది నిర్మాతలకు డబ్బులు మూగల్చడానికే అని టామ్ అన్నాడు. జెండయా, టామ్ హాలండ్ 2016 నుండి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తొలినాళ్లలో ఇద్దరూ సైలెంట్ గా ఉన్నారు. 2021లో, జెండయా, టామ్ హాలండ్ కారులో ముద్దుపెట్టుకుంటున్న ఫోటో వైరల్ అయింది. ఆ తర్వాత వారి రిలేషన్ పబ్లిక్‌గా మారింది. ఇప్పుడు వీరిద్దరూ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తారని తెలిసి అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.