అమ్మబాబోయ్..! 90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ చిన్నది అందాలతో గత్తర లేపింది..
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్.. హిట్ టాక్ తెచ్చుకుని మిలియన్లలో వ్యూస్ సాధించింది. 90’s కిడ్స్ ఈ సిరీస్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. ఇందులో సుచిత్ర డేవిడ్ పాల్ అనే పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ పాత్రలో నటించిన చిన్నది ఎవరో తెలుసా.?
ఈ మధ్యకాలంలో ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో వచ్చే సినిమాలతో పాటు ఓటీటీలో విడుదలయ్యే సిరీస్లు , సినిమాల కోసం ప్రేక్షకులు రెట్టింపు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దాంతో ఓటీటీలో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ లో సినిమాలు చూస్తున్న ఆడియన్స్ ఓటీటీలోనూ సినిమాలు సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చాలా మంది సినీ సెలబ్రెటీలు కూడా వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన వారు ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకొని. ఆతర్వాత బిగ్ బాస్ తో మంచి పేరుతెచ్చుకున్న హీరో శివాజీ కూడా మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ .
ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట
1990 కాలం జనరేషన్ పిల్లలు, తల్లి తండ్రులు, అప్పటి పరిస్థితులు ఈ వెబ్ సిరీస్లో చూపించారు. చక్కటి ఎమోషన్స్, ఆకట్టుకునే సంభాషణలు, చక్కటి మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ సిరీస్ ఓ తెలుగు ఓటిటి మాధ్యమం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ వచ్చి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికీ దీన్ని రిపీట్ గా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఇక ఈ సిరీస్ లో నటించిన అందరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఈ సిరీస్ లో సుచితా డేవిడ్ పాల్ అనే పాత్రలో కనిపించిన చిన్నది గుర్తుందా.? ఈ చిన్నదాని పేరు స్నేహల్ కామత్.
ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..
ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. కాగా 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ లో తన నటనతో క్యూట్ నెస్ తో కట్టిపడేసింది. ఈ సిరీస్ తో స్నేహల్ కామత్ కు మంచి పేరు వచ్చింది. అంతే కాదు అరవింద సమేతసినిమాలో పూజా హెగ్డే ఫ్రెండ్ పాత్రలో కూడా నటించింది స్నేహల్. అలాగే కైలాసపురం అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత ఈ అమ్మడు కోసం ఆడియన్స్ గూగుల్ ను గాలించారు.
ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.