సినిమా బాన్ చేయాలని డిమాండ్ చేశారు.. కట్ చేస్తే వందరోజులు ఆడింది..
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ కెరీర్‌లో తొలుత కాస్త.. ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అనంతరం.. ‘ఖైదీ’ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇందులో ఆషిక రంగనాథ్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓప్రాజెక్ట్ చేస్తున్నారు చిరంజీవి. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమా మన శంకరవరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే టైటిల్ ను ఖరారు చేశారు.
హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?
ఇదిలా ఉంటే మెగాస్టార్ సినిమాను ఒకానొక సమయంలో బ్యాన్ చేయాలని పెద్దెత్తున వాదనలు జరిగాయి. మహిళా సంఘాలు చిరంజీవి సినిమా పై మండిపడ్డారు. కానీ ఆ సినిమా విడుదల తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా 100రోజులు ఆడింది ఆ సినిమా.. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమానే అల్లుడా మజాకా.. 1995లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ.వి.వి. సత్యనారాయణ డైరెక్టర్ చేశారు. చిరంజీవి హీరోగా, రమ్యా కృష్ణ, రంభ, లక్ష్మి, కోట శ్రీనివాస రావు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. పోసాని కృష్ణమురాలి రాసిన స్క్రిప్ట్ కు రాజ్-కోటి సంగీతం అందించారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర అల్లుడు సీతారాముడు, అతని అత్త లక్ష్మి పాత్ర మధ్య కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..
విడుదలైన రెండు నెలల తర్వాత సినిమా వివాదాలకు గురయింది. మహిళల పాత్రలు, ముఖ్యంగా అసభ్య సన్నివేశాలు (వల్గర్ సీన్స్) కారణంగా కమ్యూనిస్టులు, హిందూ తీవ్రవాదులు బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ చిరంజీవి అభిమానులు పెద్ద సంఘటనలు చేసి ప్రతిఘటించడంతో, బ్యాన్ చేయకుండా వివాదాస్పద సీన్స్‌ను కట్ చేశారు. ఆతర్వాత కూడా మహిళా ప్రేక్షకుల నుంచి కూడా బాక్‌లాష్ వచ్చింది. కానీ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా 100రోజులు ఆడింది.
అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








