AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరో హీరోయిన్ మధ్య 23 సంవత్సరాలు తేడా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

భారీ అంచనాల మధ్య విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమాకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇందులో హీరోహీరోయిన్ మధ్య 23 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా.. ?

Tollywood : హీరో హీరోయిన్ మధ్య 23 సంవత్సరాలు తేడా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Cinema (5)
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2025 | 4:04 PM

Share

దాదాపు 15 సంవత్సరాల క్రితం ఇదే రోజు భారతదేశంలో విడుదలైన ఓ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. హీరోహీరోయిన్ మధ్య వయసు వ్యత్యాసం 23 సంవత్సరాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు రోబో. తమిళంలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. 2010లో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. ఇందులో శాస్త్రవేత్త డాక్టర్ వసీకరన్ పాత్రలో కనిపించారు రజినీ. ఈ సినిమా మొత్తం అతడి జీవితం చుట్టూ తిరుగుతుంది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

అతడు చిట్టి అనే అధునాతన రోబోను సృష్టిస్తాడు. అచ్చం మనిషిని పోలీ ఉన్న ఆ రోబోను యుద్ధంలో లేదా అత్యవసర పరిస్థితులలో మానవ ప్రాణాలకు ముప్పు లేకుండా సహాయం చేయగలిగేలా.. భారత సైన్యం ఉపయోగించుకోవాలని డాక్టర్ వసీకరన్ భావిస్తాడు. కానీ రోబోకు ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ లేకపోవడంతో భారత సైన్యంలోకి దానిని రిజెక్ట్ చేస్తారు. దీంతో వసీకరన్ ఆ రోబోకు భావోద్వేగాలు అర్థం చేసుకోవడం.. ఫీలింగ్స్ తెలియజేయడం నేర్పిస్తాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. రోబో నెమ్మదిగా వసీకరన్ ప్రేయసి సనా (ఐశ్వర్య రాయ్)ను ప్రేమిస్తుంది. ఆ తర్వాత వసీకరన్ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. చివరకు రోబోతో వసీకరన్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ.. ? ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఈ మూవీ సమయంలో హీరోహీరోయిన్ మధ్య వయసు తేడా 23 సంవత్సరాలు కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. నివేదికల ప్రకారం ఈ సినిమా భారతదేశంలో రూ.193 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.291 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు IMDBలో 10కి 7.2 రేటింగ్ కలిగి ఉంది. 2018లో ఈ సినిమా సీక్వెల్ రోబో 2.0 విడుదలైంది. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?