AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollwyood : ముంబైలో మన స్టార్స్ విలాసవంతమైన ఇళ్లను చూశారా ?.. ఇంద్రభవనాలే..

సౌత్ టూ నార్త్ స్టార్స్ కనిపిస్తుంటారు. అయితే మన దక్షిణాది సెలబ్రెటీలకు ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్స్ ఉన్నాయని తెలుసా. తమ స్వస్థలాలతోపాటు.. ముంబైలోనూ సంపన్న అఫార్ట్మెంట్స్ కలిగి ఉన్న తారలు ఎవరెవరో తెలుసా. పూజా హెగ్డే, రష్మిక మందన్న, అల్లు అర్జున్, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, తమన్నాలకు ముంబైలో ఉన్న లగ్జరీ ఇళ్లను ఒకసారి చూసేద్దామా.

Tollwyood : ముంబైలో మన స్టార్స్ విలాసవంతమైన ఇళ్లను చూశారా ?.. ఇంద్రభవనాలే..
Pooja Hegde, Rashmika
Rajitha Chanti
|

Updated on: May 25, 2023 | 11:02 AM

Share

భారతీయ సినీ పరిశ్రమలోని ఫ్లాష్, గ్లామర్ అంటే ఠక్కున గుర్తొచ్చే నగరం ముంబై. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి అసలైన చిరునామా. ఇక్కడ భాషతో సంబంధం.. సౌత్ టూ నార్త్ స్టార్స్ కనిపిస్తుంటారు. అయితే మన దక్షిణాది సెలబ్రెటీలకు ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్స్ ఉన్నాయని తెలుసా. తమ స్వస్థలాలతోపాటు.. ముంబైలోనూ సంపన్న అఫార్ట్మెంట్స్ కలిగి ఉన్న తారలు ఎవరెవరో తెలుసా. పూజా హెగ్డే, రష్మిక మందన్న, అల్లు అర్జున్, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, తమన్నాలకు ముంబైలో ఉన్న లగ్జరీ ఇళ్లను ఒకసారి చూసేద్దామా.

పూజా హెగ్డే.. తెలుగుతోపాటు.. తమిళంలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పూజా హెగ్డే. కేవలం సినీరంగంలోనే కాకుండా.. వ్యాపారంలోనూ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకుంది. అయితే ముంబైలో ఈముద్దుగుమ్మకు విలావంతమైన భవనం ఉంది. షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు ముంబైలో వాలిపోతుంటుంది. ఇటీవల హోంటూర్ వీడియో చేసింది పూజా.

ఇవి కూడా చదవండి

రష్మిక మందన్నా.. కన్నడ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో మనసులను గెలుచుకున్న ముద్దుగుమ్మ నటి రష్మిక మందన్న. ఈ బ్యూటీ కూడా ముంబైలో నివాసం ఏర్పరుచుకుంది. ఆమె బిజీ షెడ్యూల్ మధ్యలో, ఆమె నగరంలోని తన సంపన్న అపార్ట్మెంట్లో విశ్రాంతి తీసుకుంటుంది .

అల్లు అర్జు్న్.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ.. ముంబైలో విలాసవంతమైన ఇళ్లు కలిగి ఉన్నాడు.

రామ్ చరణ్.. తెలుగు చిత్రాలలో తన అద్భుతమైన నటనకు రామ్ చరణ్ కేరాఫ్ అడ్రస్. ఈ హీరోకు ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ కలిగి ఉన్నాడు. ఆడంబరంతో కూడిన ప్రశాంతమైన ప్రదేశాన్ని అందిస్తుంది.

కాజల్.. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి కాజల్ అగర్వాల్. ఇప్పుడు ముంబైలోని సంపన్న అపార్ట్‌మెంట్లలో నివసించే దక్షిణ భారత తారల ర్యాంక్‌లో చేరింది.

తమన్నా.. తమిళం, తెలుగు చిత్రాలలో పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ తమన్నా భాటియా. ఈ ముద్దుగుమ్మ ముంబైలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సంపన్నమైన అపార్ట్మెంట్లో ఆమె విశ్రాంతి, ఆకర్షణీయమైన జీవనశైలి ని ఆనందిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.