Tollywood: ఒకప్పుడు కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన అమ్మాయిలు.. ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడేం చేస్తున్నారంటే..
90's కిడ్స్ ఫేవరేట్ సింగర్స్‌లో ఫల్గుణి పాఠక్ ఒకరు. అప్పట్లో ఆమె కంపోజ్ చేసిన పాటలు యూత్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు ఆమె పాటలకు దేశం మొత్తం విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎక్కడ విన్నా ఫల్గుణి పాఠక్ పాటలు మారుమోగేవి. ఇప్పటికీ ఆమె కంపోజ్ చేసిన పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూ్స్ తో దూసుకుపోతుంటాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సింగర్ ఫల్గుణి పాఠక్ చాలా ఫేమస్. ఆమె గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఈతరం యువతకు అంతగా ఆమె గురించి తెలియకపోవచ్చు. కానీ 90’s అమ్మాయిలు, అబ్బాయిలకు ఆమె ఇష్టమైన సింగర్. ఇప్పటికీ ఆమె కంపోజ్ చేసిన పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతుంటాయి. అలాగే ఎక్కడో ఒకచోట ఫల్గుణి సాంగ్స్ వినిపిస్తుంటాయి. ఫల్గుణి కంపోజ్ చేసిన పాటలలో జోడే రెజో రాజ్, ఝూమ్ఝూమ్, హవా హమే ఉదతి జాయే, యే కిస్నే జాదూ కియా, మేరీ చునర్ ఉద్ద్ అద్ద జాయే, మైనే పాయల్ హై ఛంకై, అయ్యో రామా వంటి పాటలు యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో అమ్మాయిలకు చాలా ఇష్టమైన సాంగ్ మేరీ చునర్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే ఒకటి. ఇప్పటికీ ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఈ పాటలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్స్ గా స్టార్ స్టేటస్ అందుకున్నారు. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఆ ఇద్దరు కలిసి స్క్రీన్ పై కనిపించిన ఫస్ట్ సాంగ్ ఇదే. పైన ఫోటోను చూస్తే గుర్తుపట్టే ఉంటారు కదా. ఆ ఇద్దరు ఎవరో. తెలుగు, హిందీ, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒకరు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం కాగా.. మరొకరు మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ గడిపేస్తూ ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఆ ఇద్దరు ఎవరో కాదు. టాలీవుడ్ హీరోయిన్స్ అయేషా టాకియా, త్రిష. ఇద్దరూ తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. మేరీ చునార్ ఉద్ద్ ఉద్ద్ జాయే పాటలో త్రిషను చూసిన డైరెక్టర్ ప్రియదర్శన్ ఆమెకు 2003లో లేసా లేసా సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వర్షం, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, కింగ్, స్టాలిన్, దమ్ము, తీన్ మార్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది త్రిష. అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న త్రిష.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది.
ఇక హీరోయిన్ అయేషా టాకియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగులో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అయేషా.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.