పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక మోహన్ 

07 June 2026

Pic credit - Instagram

Rajeev 

 తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ ప్రియాంక మోహన్.

ప్రియాంక తొలిసారిగా కన్నడ సినిమా ఒంధ్‌ కథే హెళ్ల (2019) ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ వయ్యారి భామ.

తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

ఆతర్వాత వరుసగా తమిళ్ సినిమాల్లో నటించింది ప్రియాంక.. ఆతర్వాత ఇటీవలే తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది సూపర్ హిట్ అందుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుంతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో క్రేజీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇటీవలే మేడ్ ఇన్ కొరియా సినిమాతో మరో హిట్ అందుకుంది ప్రియాంక