6 నిమిషాల డాన్స్‌కు 6 కోట్లు.. ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

07 June 2026

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘శ్రీ’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ

దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు.

ప్రస్తుతం తన భారీ రెమ్యునరేషన్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా తమన్నా సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ ద్వారా ఫేమస్ అయ్యింది.

ముఖ్యంగా రజనీకాంత్ 'జైలర్' చిత్రంలోని 'కావాలయ్యా' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా మరోపాటతో సంచలనం సృష్టించింది.

అలాగే 'స్వింగ్ జరా', బాలీవుడ్ చిత్రం 'రైడ్ 2'లోని 'నషా' వంటి సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ఈ పాటల సక్సెస్ ఆమె వాల్యూని పెంచేసింది.

గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో తమన్నా కేవలం 6 నిమిషాల స్టేజ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట.

అంటే లెక్క ప్రకారం చూస్తే నిమిషానికి దాదాపు ఒక కోటి రూపాయలు వసూలు చేసినట్లయింది. ఒక చిన్నపాటి డాన్స్ షోకు ఈ స్థాయి మొత్తాన్ని అందుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

గతంలో 'జైలర్' సాంగ్ కోసం రూ.3 కోట్లు, 'రైడ్ 2' సాంగ్ కోసం రూ.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఆమె ఓటీటీలో బిజీగా ఉంటుంది.