ఎర్ర చీరలో జ్యోత్స్న అరాచకం.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
07 June 2026
కార్తీక దీపం 2 సీరియల్‌లో విలన్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను భయపెడుతున్న నటి గాయత్రీ సింహాద్రి తన నటనతోనే కాకుండా, తన గ్లామరస్ లుక్స్‌తో కట్టిపడేస్తుంది.
తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. విజయవాడకు చెందిన గాయత్రీ సింహాద్రి, మోడలింగ్ రంగం ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది.
'మిస్ వైజాగ్' వంటి టైటిల్స్‌ను గెలుచుకున్నారు. 2022లో 'త్రినయని' సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, అనంతరం 'పల్లకిలో పెళ్లికూతురులో నటించింది.
'అత్తారింటికి దారేది' వంటి సీరియల్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 'మ్యాడ్' సినిమాలో కూడా చిన్న పాత్రలో మెరిసి, యాంకర్‌గా తన సత్తా చాటారు.
'కార్తీక దీపం 2'లో జ్యోత్స్న పాత్రలో గాయత్రి నటన అద్భుతం. గతంలో మోనిత పాత్రలో శోభాశెట్టి ఎలాగైతే ప్రేక్షకులను విలనిజంతో మెప్పించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పుడు గాయత్రి తన కన్నింగ్ ప్లాన్స్, ఎత్తుగడలతో ఆ స్థాయిలోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెరపై అంత క్రూయల్ విలన్‌గా కనిపిస్తున్నప్పటికీ, నెట్టింట గ్లామర్ లుక్స్ తో చంపేస్తుంది.
చీరకట్టులో పంచుకున్న ఫోటోలు కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్లను తలదన్నే అందంతో, తన ఫిజిక్‌ని ఎలివేట్ చేస్తూ ఆమె చేసిన ఈ ఫోటోషూట్ ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది.
"సీరియల్స్‌లో ఇంతటి విలనిజం పండిస్తూ, రియల్‌లో ఇంత అందంగా ఉంటారా?" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గాయత్రి తన గ్లామర్ , నటనతో బుల్లితెరపై దూసుకుపోతున్నారు.