Prabhas: ఇన్ స్టాలో 12.8 మిలియన్ ఫాలోవర్స్.. 23 మందినే ఫాలో అవుతున్న ప్రభాస్.. ఎవరెవరంటే..

ఇక డార్లింగ్ ఇచ్చే ఆతిధ్యం గురించి ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. తనను ఆరాధించే ఫ్యాన్స్‏కు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నా అనే భరోసా కల్పిస్తాడు. ఇటీవల వరదలతో నిరాశ్రయులైన ఎంతోమందికి కోట్లాది రూపాయాలను విరాళంగా ప్రకటించారు. సినిమా షూటింగ్ సెట్ లో తనతోపాటు వర్క్ చేసే చిత్రయూనిట్ సభ్యులకు టెక్నిషీయన్స్ కడుపు నిండా ఇంటి భోజనం పెడతాడు.

Prabhas: ఇన్ స్టాలో 12.8 మిలియన్ ఫాలోవర్స్.. 23 మందినే ఫాలో అవుతున్న ప్రభాస్.. ఎవరెవరంటే..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 11, 2024 | 7:25 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న డార్లింగ్.. ఇటీవలే కల్కి 2898 ఏడీ చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. నార్త్ లో ప్రభాస్ ఓ రేంజ్ అభిమానులు ఉన్నారు. విదేశాల్లోనూ ఎంతో మందికి ప్రభాస్ అంటే విపరీతమైన ఇష్టం. డార్లింగ్ సినిమా అప్డేట్స్ కోసం కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా తక్కువేం కాదు. బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక డార్లింగ్ ఇచ్చే ఆతిధ్యం గురించి కూడా తెలిసిందే. ఇటీవల వరదలతో నిరాశ్రయులైన ఎంతోమందికి కోట్లాది రూపాయాలను విరాళంగా ప్రకటించారు. సినిమా షూటింగ్ సెట్ లో తనతోపాటు వర్క్ చేసే చిత్రయూనిట్ సభ్యులకు టెక్నిషీయన్స్ కడుపు నిండా ఇంటి భోజనం పెడతాడు.

ప్రస్తుతం చేతిలో నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ప్రభాస్.. సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే యాక్టివ్ ఉంటారు. తన సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 12.8 మిలియన్స్ ఉన్నారు. అంటే అక్షరాల12 లక్షల కంటే ఎక్కువ మంది ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు. కానీ డార్లింగ్ మాత్రం కేవలం 23 మందినే ఫాలో అవుతున్నారు. ప్రభాస్ ఫాలో అవుతున్న వారిలో ముందుగా వచ్చేది తన పెద్దనాన్న దివంగత హీరో కృష్ణంరాజు. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ వంగా. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణే, నటి రిద్ధీ కుమార్ తోపాటు ఆదిపురుష్ ఫేమ్ సన్నీ సింగ్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్, నటి భాగ్య శ్రీ, డైరెక్టర్ రాధాకృష్ణ, అమితాబ్ బచ్చన్, శ్రుతి హాసన్, డైరెక్టర్ ఓంరౌత్, పూజా హెగ్డే, డైరెక్టర్ నాగ్ అశ్విన్, సాహో డైరెక్టర్ సుజిత్, శ్రద్ధా కపూర్ ను ఫాలో అవున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే న్యూ హీరోయిన్ మాన్వీ, హీరోయిన్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, డైరెక్టర్ మారుతి, సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ లను కూడా ప్రభాస్ ఫాలో అవుతున్నారు. ప్రభాస్ కేవలం తాను వర్క్ చేసిన.. ప్రస్తుతం వర్క్ చేస్తున్న వారినే ఫాలో అవుతుండడం గమనార్హం. టాలీవుడ్ హీరోలను ఏ ఒక్కరిని డార్లింగ్ ఫాలోకావడం లేదు. కానీ తెలుగు చిత్రపరిశ్రమలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గోపిచంద్. అలాగే రామ్ చరణ్, రానా దగ్గుబాటి, ఎన్టీఆర్ కూడా ప్రభాస్ ప్రాణ స్నేహితులే. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!