Nani: నానికి ఇండస్ట్రీలో ఆ ముగ్గురే బెస్ట్ ఫ్రెండ్స్.. ఆ ఇద్దరు హీరోలతో స్పెషల్ బాండింగ్..
న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్యారడైజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. అయితే ఇండస్ట్రీలో నానికి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో రివీల్ చేశారు.

న్యాచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే హిట్ 3 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్యారడైజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా జగపతి బాబు హోస్టింగ్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో పాల్గొన్న నాని తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..
జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో పాల్గొన్న నాని.. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి రివీల్ చేశారు. ఈ షోలో జగపతి బాబు మాట్లాడుతూ.. అర్ధరాత్రి అయినా సరే ఏదైనా సహాయం కావాలంటే మొట్టమొద మెసేజ్ చేయగలిగేంత బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఎవరున్నారు ? అని అడగ్గా.. నాని మాట్లాడుతూ.. రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టి, నీరజ కోన అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
ముందు నుంచి రానా, నాని మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇక నిన్ను కోరి సినిమాలో ఆదిపినశెట్టి కలిసి నటించారు. అలాగే నీరజ కోన పంజా సినిమాకు నిర్మాత. వీరిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉందట.
ఇవి కూడా చదవండి : గ్లామర్లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..



