Tollywood: ‘మనది గవర్నమెంట్ స్కూలే’.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఎమ్మెల్యేగా కూడా పోటీచేసిందండోయ్
హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా 2-3 ఫ్లాపులు పడితే చాలా పరిశ్రమ నుంచి కనుమరుగైపోతారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో మహశ్ బాబు, నానీ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిందీ అందాల తార.. కానీ.. ఆ తర్వాత..

పై ఫొటోలో ఉన్న స్కూల్ డ్రెస్ లో క్యూట్ గా ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? కొన్నేళ్ల క్రితం వరకు ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉందనుకోండి.. కానీ అంత యాక్టివ్ గా ఉండడం లేదు. కర్ణాటకలోని హుబ్లిలో ఒక తెలుగు కుటుంబంలో ఈ అందాల తార జన్మించింది. తల్లిదండ్రులు కోస్తాంధ్ర ప్రాంతానికి చెందినవారే. కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే మహేష్ బాబు, నాని వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టింది. అందం, అభినయం పరంగానూ మంచి మార్కులు సొంతం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఆ తర్వాత వరసగా పరాజయాలు ఎదుర్కొంది. క్రమంగా హీరోయిన్ గా అవకాశాలు సన్నగిల్లాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సహాయక నటి పాత్రలు పోషించినా సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలా అయ్యింది. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైందీ అందాల తార.
సినిమాల సంగతి పక్కన పెడితే.. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడేతత్వమున్న ఈ నటి ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోంది. భారతీయ జనతా పార్టీ తరపున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. అయితే విజయం సాధించలేకపోయింది. కానీ మహిళా సమస్యలపై తన గళం వినిపిస్తూనే ఉంది. ఆ మధ్యన రాయలసీమకు చెందిన ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ ఈ నటిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె కూడా సై అంటే సై అంటూ ఆయనకు ఎదురు తిరిగి వార్తల్లో నిలిచింది. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. తను మరెవరో కాదు నచ్చావులే హీరోయిన్ మాధవీలత.
మాధవీలత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మహేశ్ బాబు నటించిన అతిథి సినిమాలో ఓ చిన్న పాత్ర తో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది మాధవీలత. ఆతర్వాత నచ్చావులే, స్నేహితుడా వంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత అవకాశాలు కనుమరుగుకావడంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీ లత మహిళా సమస్యలపై తన వాయిస్ వినిపిస్తుంటుంది. అలాగే తన చిన్ననాటి ఫొటోలు కూడా తరచూ షేర్ చేస్తుంటుంది. పై ఫొటో అదే. ఇది ఆమె హైస్కూల్ డేస్ నాటి ఫొటో. ఈ ఫొటోను షేర్ చేసిన ఆమె ‘మనది గవర్న మెంట్ హైస్కూలే’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







