The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్'. ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యాయి. ఓటీటీలో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లో మూడో సీజన్ గురువారం (నవంబర్ 20) నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.

మన దేశంలో అత్యంత ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్1’ సూపర్ హిట్ గా నిలిచింది. వ్యూస్ పరంగా రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అంతకు మించిన వినోదాన్ని అందించింది. స్టార్ హీరోయిన్ సమంత నెగెటివ్ రోల్ లో కనిపించడం సెకెండ్ సీజన్ లో హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సిరీస్ లో మూడో పార్ట్ కూడా రానుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్3’ గురువారం ( నవంబరు 21వ తేదీ) నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
కాగా ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయి కీలక పాత్ర పోషించాడు. సిరీస్ మొత్తం ఇతని చుట్టే తిరుగుతుంది. ఏజెంట్ శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ నటన అద్బుతమని చెప్పుకోవచ్చు. భర్తగా, ఇద్దరు పిల్లల తండ్రిగా చాలా సెటిల్డ్ గా నటించాడు మనోజ్. అయితే ఇంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ పాత్ర, వెబ్ సిరీస్ కథ ముందుగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్లాయట. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ముందుగా దీనిని ఒక సినిమా కథగా రాసుకుని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌కు చెప్పారట. ఆయనకు కూడా కథ బాగా నచ్చడంతో చిరుని కలిసి స్టోరీ వినిపించారట. అప్పటికే ‘ఖైదీ నంబర్ 150’ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవికి ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ కూడా బాగా నచ్చిందట. అయితే అప్పుడప్పుడే రీ ఎంట్రీ ఇచ్చిన తనకు మనోజ్ పాత్ర ముఖ్యంగా ఇద్దరు పిల్లల తండ్రిగా ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదోనని చిరంజీవి సందిగ్ధంలో పడ్డారట. అయితే ఎలాగైనా చిరంజీవితో దీనిని తెరకెక్కించాలన్న రాజ్ అండ్ డీకే కావాలంటే కూతురు, కొడుకు పాత్రలను తీసి పక్కనపెడదామని చిరంజీవికి చెప్పారట. కానీ అప్పటికీ కూడా ఈ అది ఎందుకో కార్య రూపం దాల్చలేదట.
మరికొన్ని గంటల్లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్ట్రీమింగ్..
You know what time it is? ITS DEGA JAAN DANCE TIME 💃🕺#TheFamilyManOnPrime, New Season, November 21 pic.twitter.com/Brc3Bem13D
— prime video IN (@PrimeVideoIN) November 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








