Jawan Movie: బ్లాక్ బస్టర్ హిట్ ‘జవాన్’.. షారుఖ్ నుంచి విజయ్ సేతుపతి వరకు.. ఒక్కొక్కరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?..

సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుదలకు ముందే రూ.50 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగ్గా.. రిలీజ్ రోజే అత్యధిక వసూళ్లు రాబట్టింది. హైదరాబాద్, బెంగుళూరుతో పాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో షారూఖ్ ఖాన్ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. సౌత్ ఇండియన్ నటీనటులు, టెక్నీషియన్స్ చాలా మంది ఈ సినిమాలో పనిచేశారు. ప్రస్తుతం ఈసినిమాలో నటించిన నటీనటులు రెమ్యూనరేషన్స్ వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Jawan Movie: బ్లాక్ బస్టర్ హిట్ 'జవాన్'.. షారుఖ్ నుంచి విజయ్ సేతుపతి వరకు.. ఒక్కొక్కరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?..
Jawan Movie Team
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2023 | 4:18 PM

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. చాలా కాలం తర్వాత పఠాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన..ఇప్పుడు జవాన్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుదలకు ముందే రూ.50 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగ్గా.. రిలీజ్ రోజే అత్యధిక వసూళ్లు రాబట్టింది. హైదరాబాద్, బెంగుళూరుతో పాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో షారూఖ్ ఖాన్ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. సౌత్ ఇండియన్ నటీనటులు, టెక్నీషియన్స్ చాలా మంది ఈ సినిమాలో పనిచేశారు. ప్రస్తుతం ఈసినిమాలో నటించిన నటీనటులు రెమ్యూనరేషన్స్ వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఈ సినిమాలో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‏గా నటించింది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించగా.. అతిథి పాత్రోల దీపికా పదుకొణె నటించింది. షారుఖ్, నయన్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు నయనతారకు రూ.10 కోట్లు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

అలాగే ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు విజయ్ సేతుపతి. షారుఖ్ తో ఆయన కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో రెండు షేడ్స్‌లో కనిపించాడు. ఈ సినిమాలో అతని పాత్ర పేరు కాళీ గైక్వాడ్. ఈ సినిమాలో విజయ్ పాత్రకు.. షారుఖ్ ఖాన్ 23 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించింది. అందుకు ఆమెకు ఐదు కోట్లు చెల్లించినట్లు సమాచారం. అలాగే ప్రియమణి, సన్యా 3 కోట్లు, రిధి డోగ్రా, సంగీతకు ఒక్కొక్కరికి 1 కోటి తీసుకున్నారు. హాస్యనటులు యోగి బాబు, సునీల్ గ్రోవర్‌లకు ఒక్కొక్కరికి రెండు కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో షారుఖ్.. చాలా షేడ్స్‌లో కనిపించాడు. ఆర్మీ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, ప్రయాణికులను బందీలుగా పట్టుకునే కిడ్నాపర్, ప్రజల కోసం పనిచేసే రాబిన్ హుడ్ పాత్రలలో కూడా కనిపించాడు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.