Ustaad Bhagat Singh: పవన్ మిగిలిన సినిమాలతో పోలిస్తే.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనుకున్నంత వేగంగా అయితే సాగట్లేదు. ఆ మధ్య 10 రోజుల షెడ్యూల్ తర్వాత పవన్ పాలిటిక్స్‌తో బిజీ అయ్యారు. ఆ తర్వాత బ్రో, ఓజి కోసం హరీష్ శంకర్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇన్నాళ్లకు ఉస్తాద్‌కు టైమ్ వచ్చింది. హైదరాబాద్‌లోనే భారీ షెడ్యూల్ మొదలైంది. ఈసారి పవన్ కూడా షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు. ఇందులో యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని పవర్ ప్యాక్డ్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు హరీష్ శంకర్.