ఒకేసారి రెండు సినిమాలు చేయడం అనే పద్దతికి మహేష్ ఎప్పుడూ విరుద్ధమే. అత్యవసరం అయితే తప్ప.. అలాంటి నిర్ణయాన్ని అయితే తీసుకోరు సూపర్ స్టార్. సుమారు 20 ఏళ్ళ కింద ఒక్కడు, నిజం సినిమాలను ఒకేసారి పూర్తి చేసారు మహేష్. ఈ రెండూ చాలా తక్కువ టైమ్‌లోనే రిలీజయ్యాయి. ఆ తర్వాత 2017లో స్పైడర్, భరత్ అనే నేను సినిమాలు కూడా ఒకేసారి పూర్తి చేసారు సూపర్ స్టార్.