AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియల్ నటుడు ప్రభాకర్ కూతురిని చూశారా..? అచ్చం హీరోయిన్‌లా ఉందే..

సీరియల్ నటులు అలా కాదు ఏడాది పొడవునా మన టీవీల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇక సీరియల్స్ ద్వానా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో ప్రభాకర్ ఒకరు. ఈ సీరియల్ నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాకర్ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

సీరియల్ నటుడు ప్రభాకర్ కూతురిని చూశారా..? అచ్చం హీరోయిన్‌లా ఉందే..
Prabhakar
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2024 | 2:27 PM

Share

సినిమా వాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్స్ వాళ్లకు కూడా అంటే క్రేజ్ ఉంటుంది. నిజానికి సినిమా వాళ్ళు ఏడాదికి ఒకటో రెండో సినిమాల్లో మెరుస్తారు. కానీ సీరియల్ నటులు అలా కాదు ఏడాది పొడవునా మన టీవీల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇక సీరియల్స్ ద్వానా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో ప్రభాకర్ ఒకరు. ఈ సీరియల్ నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాకర్ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ సమయంలో ఆయనను బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలిచేవారు. ప్రభాకర్ సీరియల్స్ లోనే కాదు సినిమాల్లోనూ నటించారు. ఇప్పటికీ ఆయన సీరియ్సల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

ఇక ప్రభాకర్ నటించిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఆపరేషన్ దుర్యోధన. ఈ సినిమాలో పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించి మెప్పించాడు ప్రభాకర్. అలాగే చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేశారు. అయితే ప్రభాకర్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలిసిందే ఉంటుంది. మొన్నామధ్య ఆయన కొడుకును హీరోగా పరిచయం చేశారు కూడా.. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. కానీ తర్వాత ఆ సినిమా అప్డేట్స్ ఏమీ లేవు. సినిమాలు లేకపోయినా ఆటిట్యూడ్ స్టార్ గా ఇప్పటికే చాలామందికి పరిచయం అయ్యాడు చంద్రహాస్.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

ప్రభాకర్ భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నారు. అలాగే ఆమెకు ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ప్రభాకర్ కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివిజ తన బ్యూటీఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె క్రేజీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ అమ్మడి ఫొటోలో చూసి ప్రభాకర్ కూతురా..! అంటూ అందరూ షాక్ అవుతున్నారు. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us