అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవికుమార్. ఈ స్టార్ డైరెక్టర్ ఎక్కువగా తమిళ్ లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సినిమాల గురించి చెప్పాలంటే ఒకే ఒక్క సినిమా చాలు. అదే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు.

అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.
Ks Ravikumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 23, 2024 | 9:10 PM

తమిళ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి దర్శకుల్లో  స్టార్ డైరెక్టర్ కే.ఎస్ రవికుమార్ ఒకరు. ఈ సీనియర్ దర్శకుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవికుమార్. ఈ స్టార్ డైరెక్టర్ ఎక్కువగా తమిళ్ లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సినిమాల గురించి చెప్పాలంటే ఒకే ఒక్క సినిమా చాలు. అదే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

1998లో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ, చిరంజీవి హీరోగా తమిళ సినిమాకు రీమేక్ చేసిన స్నేహం కోసం, కమల్ హీరోగా తెనాలి, నాగార్జున హీరోగా బావ నచ్చాడు, రాజశేఖర్ హీరోగా విలన్ లాంటి సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రవికుమార్. ఇక తెలుగులో మంచి విజయం సాధించిన భద్ర సినిమాను తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేశాడు. 2008 లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం ఒక భారీ బడ్జెట్ సినిమాకు రవి కుమార్ దర్శకత్వం వహించాడు.

కే.ఎస్ రవికుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే ఆయన బాలకృష్ణతో రెండు సినిమాలు చేశారు. జై సింహ, రూలర్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించిన స్నేహం కోసం సినిమాకు కూడా ఈయనే దర్శకత్వం వహించారు. ఇక పోతే ఈయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కె.ఎస్.రవికుమార్‌కు మొత్తం ముగ్గురు కుమార్తెలు.అందులో చిన్న కుమార్తె జస్వంతి మాత్రం తెగ పాపులారిటీ సొంతం చేసుకుంది. హీరోయిన్ లుక్ లో ఉండే ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిపోయింది. ఈ అమ్మడు ఫోటోలు చూసి నెటీజన్లు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.ఈ చిన్నదాని క్రేజీ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. కొంటె కామెంట్స్ తో ఈ బ్యూటీ ఫోటోలకు క్రేజ్ పెంచేసింది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.