Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ క్రికెటర్‏ను పిచ్చిగా ప్రేమించి.. ఒంటరిగా ఉండిపోయిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో అగ్ర హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ ఓ క్రికెటర్ ను ప్రేమించింది. 50 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: ఆ క్రికెటర్‏ను పిచ్చిగా ప్రేమించి.. ఒంటరిగా ఉండిపోయిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..
Nagma
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2025 | 12:47 PM

Share

దక్షిణాది సినీపరిశ్రమను శాసించిన స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆ ముద్దుగుమ్మ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె.. వ్యక్తిగత విషయాలతోనూ నిత్యం వార్తలలో నిలిచింది. అప్పట్లో ఆమె ప్రేమ వ్యవహారాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ తో ఆమె ప్రేమాయణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది. క్రికెటర్స్, హీరోయిన్స్ మధ్య కొన్ని ప్రేమకథలు పెళ్లి వరకు వెళ్లవు. అందులో ఈ లవ్ స్టోరీ ఒకటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే సీనియర్ హీరోయిన్ నగ్మా.

తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది నగ్మా. అలాగే కాదనల్, బాద్షా, మెట్టుకుడి, లవ్ బేట్స్ వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. దశాబ్దాలపాటు సౌత్ ఇండస్ట్రీని శాసించిన నగ్మా.. చివరగా సిటిజన్ అనే తమిళ చిత్రంలో నటించింది. తెలుగులో చిరంజీవితో ఘరానా మొగుడు, రిక్షావోడు.. బాలకృష్ణతో అశ్వమేధం, నాగార్జునతో కిల్లర్, అల్లరి అల్లుడు, వెంకటేశ్ సరసన కొండపల్లి రాజా చిత్రాల్లో నటించింది. అలాగే మోహన్ బాబు సరసన మేజర్ చంద్రకాంత్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలు నెమ్మదిగా తగ్గించింది. 2008 నుంచి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే టీమిండియా క్రికెటర్ సౌరవ్ గంగూలీతో నగ్మా ప్రేమలో పడ్డారని అప్పట్లో ప్రచారం నడిచింది. 1999 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారని.. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారిందని టాక్ నడిచింది. కానీ అప్పటికే గంగూలీకి పెళ్లి కావడం గమనార్హం. 1997లో తన చిన్ననాటి స్నేహితురాలు డోనాను వివాహం చేసుకున్నారు గంగూలీ. దీంతో తన భర్తతోపాటు నగ్మా గురించి వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది డోనా. గంగూలీ, నగ్మా ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పడంతో ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది.

Nagma

Nagma

ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నగ్మా పేరు ముడిపడి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా ఉంటుంది. యాక్టింగ్ మానేసిన నగ్మా.. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2014లో మీరట్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

నగ్మా ఇన్ స్టా పోస్ట్.. 

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!
రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు
ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు
మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..
మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..
మెంటల్‌ స్ట్రెస్‌తో మెదడుకి చేటు.. చికిత్స చేసే పంచతంత్రాలు ఇవే!
మెంటల్‌ స్ట్రెస్‌తో మెదడుకి చేటు.. చికిత్స చేసే పంచతంత్రాలు ఇవే!
ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారా? ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి..
ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారా? ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి..