Raghavendra Rao: సీఎం కేసీఆర్‌కు అన్ని శుభాలే జరగాలని ఆకాక్షించిన దర్శకేంద్రుడు..
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు.
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు( Raghavendra Rao). యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న రాఘవేంద్ర రావు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయం నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అన్ని శుభాలే జరగాలని ఆకాంక్షించారు. యాదాద్రి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి మహాద్భుతంగా పునర్నిర్మించారని కొనియాడారు.
తాను కొత్తగా సినిమా రూపొందించే ముందు, అదేవింధంగా సినిమా విడుదల సమయంలో స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. పూర్తి వినోదభరితమైన ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమా నేడు విడుదలయిందన్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు రాఘవేంద్ర రావు. ఇక ఈ సినిమాలో సుధీర్ హీరోగా నటించగా దీపికా పిల్లి హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో అనసూయ, సునీల్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా హీరోగా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు సుధీర్. అలాగే టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయిన దీపికా పిల్లి.. ఆ తర్వాత పలు టీవీ షోల్లో యాంకర్ గా చేసింది. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ సినిమా ఈ అమ్మడి కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకు రాఘవేంద్రరావు సమర్పించడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి