AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam: సీతారామం దర్శకుడికి బంపరాఫర్‌.. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో భారీ సినిమా..

Sita Ramam: హను రాఘవపూడి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. సీతారామం చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పకున్నాడీ ట్యాలెంటెడ్‌ దర్శకుడు. చిన్న సినిమాగా విడదులైన సీతారామం భారీ సక్సెస్‌ను...

Sita Ramam: సీతారామం దర్శకుడికి బంపరాఫర్‌.. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో భారీ సినిమా..
Hanu Raghavapudi
Narender Vaitla
|

Updated on: Aug 19, 2022 | 10:40 AM

Share

Sita Ramam: హను రాఘవపూడి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. సీతారామం చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పకున్నాడీ ట్యాలెంటెడ్‌ దర్శకుడు. చిన్న సినిమాగా విడదులైన సీతారామం భారీ సక్సెస్‌ను అందుకుంది. వారం రోజుల్లోనే ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్‌ను దాటేసి దూసుకుపోతోందీ చిత్రం. సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో రోజురోజుకీ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. అందాల రాక్షసి సినిమాతో తొలిసారి ప్రేక్షకులను అలరించిన హను ఈ సినిమాతో భారీగా పేరు సంపాదించుకున్నాడు.

సీతారామం ఇచ్చిన సక్సెస్‌తో హను రాఘవపూడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోలకు హను కథలు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ హనుతో భారీ బడ్జెట్‌ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం టాప్‌ హీరోను అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్‌ సినిమాకు బడ్జెట్‌ కూడా ఓ రేంజ్‌లో ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి హను తర్వాతి సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు.? అసలు ఈ సినిమా ఎలా ఉండనుంది. లాంటి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్