AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: హిందీలో దుమ్మురేపుతోన్న కార్తికేయ.. 50 స్క్రీన్లతో మొదలై ఎంతకు చేరిందంటే..

Karthikeya 2: నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వండర్స్‌ క్రియేట్‌ చేస్తుంది. కథలో బలం ఉండాలే కానీ...

Karthikeya 2: హిందీలో దుమ్మురేపుతోన్న కార్తికేయ.. 50 స్క్రీన్లతో మొదలై ఎంతకు చేరిందంటే..
Karthikeya 2
Narender Vaitla
|

Updated on: Aug 19, 2022 | 9:57 AM

Share

Karthikeya 2: నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వండర్స్‌ క్రియేట్‌ చేస్తుంది. కథలో బలం ఉండాలే కానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడానే ఉండదని నిరూపించిందీ చిత్రం. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ కలెక్షన్లను రాబట్టుతోంది. చందూ మొండేటి మార్క్‌ దర్శకత్వం, నిఖిల్‌ నటన ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. అడ్వెంజర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ వెర్షన్‌లోనూ ఈ సినిమా వండర్స్‌ క్రియేట్ చేస్తోంది.

హిందీలో రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతోందీ సినిమా. సినిమాకు దక్కుతోన్న ఆదరణతో థియేటర్లను పెంచుకుంటూ పోతున్నారు. తొలి రోజు కేవలం 50 స్క్రీన్లతో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 1000 స్క్రీన్స్‌కి చేరుకొని బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్‌లో కేవలం ఆరు రోజుల్లో 3000 షోలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో నిఖిల్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ వారాంతాన్ని థియేటర్లలో సెలబ్రేట్‌ చేసుకోండి అంటూ ట్వీట్ చేశారు నిఖిల్‌.

ఇవి కూడా చదవండి

కృష్ణాష్టమి, శనిఆదివారాలతో లాంగ్‌ వీకెండ్ రావడంతో కార్తికేయ 2 కలెక్షన్లను మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రెండ్‌ చూస్తుంటే కార్తికేయ ట్రిపులార్‌, పుష్ప సినిమాల సరసన నిలబడనుందనడంలో ఎలాంటి సందేహం అనిపించడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్