Amala Paul: “అప్పుడు డిప్రషన్‌లోకి వెళ్ళిపోయా.. ఎన్నో భయాలు వెంటాడాయి”.. ఎమోషనల్ అయిన అమలాపాల్

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో వరుస సినిమాలతో దూసుకుపోయింది ముద్దుగుమ్మ అమలాపాల్. లవ్ ఫెల్యూర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Amala Paul: అప్పుడు డిప్రషన్‌లోకి వెళ్ళిపోయా.. ఎన్నో భయాలు వెంటాడాయి.. ఎమోషనల్ అయిన అమలాపాల్
Amala Paul
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 19, 2022 | 5:27 PM

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో వరుస సినిమాలతో దూసుకుపోయింది ముద్దుగుమ్మ అమలాపాల్(Amala Paul). లవ్ ఫెల్యూర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మెగా పవర్ స్టార్ నటించిన నాయక్ సినిమాలో నటించి మెప్పించింది ఈ భామ. ఇక ఈ వయ్యారి భామ తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విజయ్ ను వివాహమాడింది. అనంతరం మనస్పర్ధాల్లో కారణంగా ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇక లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో బిజీ అయ్యింది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమలాపాల్ నటించిన కడావర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తాజాగా ఓ ఇంట్రవ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. అమలాపాల్ ఇండస్ట్రీలోకి వచ్చి 12ఏళ్ళు అవుతోంది. తెలుగుతో పాటు తమిళ స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.  జీవితంలో ఒకానొక సందర్భంలో చాలా ఇబ్బందిపడ్డా.. సినిమాలో రోల్స్ కోసం వెంపర్లాడినట్టు అనిపించింది. సక్సెస్ కోసం పాకులాడినట్టు అనిపించింది. నాలో నేను చాలా మదనపడ్డా.. అందరికి దూరమైనట్టు ఒంటరిగా అనిపించింది అని చెప్పుకొచ్చింది. అసలు నేను ఎందుకు సినిమాలు చేస్తున్నా అనే ఆలోచనలో పడిపోయా.. బాగా డిప్రషన్ లోకి వెళ్ళిపోయా.. అప్పుడే సినిమా వదిలేయాలని అనుకున్నా.. అదే సమయంలో మా నాన్న చనిపోయారు. చాలా భయాలు నన్ను అప్పుడు వెంటాడాయి. కానీ నేను వాటి పై పోరాడి నిలబడ్డాను  అని తెలిపింది అమలాపాల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి