Bigg Boss 6: ”బిగ్ బాస్ సీజన్ 6” ప్రసారం అయ్యేది అప్పటినుంచే.. డేట్ చెప్పేసిన నాగ్
బుల్లితెరలో బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) తో సిద్ధం అయ్యింది. విజయవంతంగా 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు రెట్టింపు ఉత్సహం తో సీజన్ సిక్స్ లోకి అడుగుపెట్టనుంది.
బుల్లితెరలో బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) తో సిద్ధం అయ్యింది. విజయవంతంగా 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు రెట్టింపు ఉత్సహం తో సీజన్ సిక్స్ లోకి అడుగుపెట్టనుంది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హాట్ గా వ్యవహరించనున్నారు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుంది. ఎవరెవరు పాటిస్పెట్ చేయనున్నావి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా ఇక బిగ్ బాస్ 6 ఈనెల సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ ప్రసారం గురించి అప్డేట్ ఇచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.
అందరు అనుకుంటున్నట్టుగానే సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం కానుంది. ఈ మేరకు అదిరిపోయే ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఓ వీధిలో కొంతమంది యువకులు పిల్లలు క్రికెట్ ఆడుతుండగా బౌలర్ సడన్ గా పరిగెత్తుకుంటూ ఇంట్లో దూరిపోతాడు.. అలాగే అక్కడున్న వారు కూడా క్షణంలో మాయం అయిపోతారు. బ్యాట్సమెన్ ఒక్కడే మిగిలిపోతాడు. అప్పుడు నాగ్ మెకానిక్ గెటప్లో వచ్చి అట్టా ఎర్రి మొహమేసుకుని సూత్తావేంట్రా.. ఇక్కడ ఆట ఆగిందంటే అక్కడ అసలైన ఆట మొదలైనట్లే..అంటూ డైలాగ్ చెప్పి బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 6 నుంచి మొదలవుతుందని అనౌన్స్ చేశారు.