AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Kammula: విద్యార్థులతో కలిసి సినిమా వీక్షించిన టాప్ డైరెక్టర్‌.. గూస్‌బంప్స్‌ వచ్చాయంటూ..

Gandhi Movie: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) ఈ సినిమాను వీక్షించారు.

Sekhar Kammula: విద్యార్థులతో కలిసి సినిమా వీక్షించిన టాప్ డైరెక్టర్‌.. గూస్‌బంప్స్‌ వచ్చాయంటూ..
Sekhar KammulaImage Credit source: TV9
Basha Shek
|

Updated on: Aug 19, 2022 | 4:27 PM

Share

Sekhar Kammula: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) గాంధీ సినిమాను వీక్షించారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని దేవి 70 MM థియేటర్‌లో విద్యార్థులతో కలిసి ఈ సినిమాను చూశారు. అనంతరం తన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. విద్యార్థులకు ఈ సదావవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్టర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ రోజు ఉదయం దేవి 70 ఎంఎం థియేటర్లో గాంధీ సినిమాను వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. నా జీవితంలో ఇదొక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రాహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తుంటే నాకు గూస్‌బంప్స్‌ వచ్చాయి. ఇలాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి. భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని శేఖర్‌ కమ్ముల తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..