Mahesh Babu: మహేష్ బాబుకు చాలా సిగ్గు.. ఆయనతో అంత ఈజీ కాదు.. గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. ఈ మూవీ ఈరోజు పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న గుణశేఖర్.. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్.. 1997 జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా బాల రామాయణం తెరకెక్కించే నంది అవార్డ్ అందుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్స్ రూపొందించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. చూడాలని ఉంది.. ఒక్కడు.. అర్జున్.. సైనికుడు.. వరుడు.. నిప్పు.. రుద్రమదేవి సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన రూపొందించిన పౌరాణిక చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. ఈ మూవీ ఈరోజు పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న గుణశేఖర్.. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ బాబుకు సిగ్గు ఎక్కువ అని.. ఆయనతో అంత ఈజీ కాదన్నారు. అలాగే మహేష్ రాముడి పాత్రకు సరిగ్గా సెట్ అవుతాడంటూ చెప్పుకొచ్చారు.
“మహేష్ బాబుతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. మహేష్ బాబుకు కాస్త సిగ్గు ఎక్కువ. సినిమా కోసం లుంగీ కట్టాలంటే ఎంతో షై ఫీలవుతారు. ఇక పోకిరి కంటే ముందు అనేక చిత్రాల్లో పోలీస్ పాత్రలను రిజెక్ట్ చేశారు. చివరకు పోకిరి సినిమా కోసం చాలా కష్టపడి ఒప్పించారు. మైథలాజికల్ డ్రామా చిత్రాలు ఆయనకు బాగు సూట్ అవుతాయి. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రలో ఆయన సెట్ అవుతారు. కానీ తనను మనం మౌల్డ్ చేసుకోవాలి. భవిష్యత్తులో అటువంటి పాత్ర చేస్తే అద్భుతంగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.




ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే నటిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.