Desamuduru: అయ్యో ఎంత పనిచేశావన్నా! దేశముదురు సినిమాను చేజేతులా వదులుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాల్లో దేశ ముదురు కూడా ఒకటి. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హన్సిక హీరోయిన్ గా నటించింది. 2007లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సినిమా కథల ఎంపికల విషయంలో ఒక్కో హీరోకు ఒక్కో క్యాలిక్యులేషన్ ఉంటుంది. డైరెక్టర్ చెప్పిన కథ తనకు సూటవుతుందా? ఫ్యాన్స్ అంగీకరిస్తారా? కామన్ ఆడియెన్స్ చూస్తారా? ఇలా అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కారణంగానే సినిమా కథలు తరచూ చేతులు మారుతుంటాయి. అలా బన్నీ బ్లాక్ బస్టర్ మూవీ అల్లు అర్జున్ విషయంలోనూ ఇదే జరిగింది. 2007లో సమ్మర్ కానుకగా రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ ఫెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు. ఇక హన్సిక అందచందాలు, అలీ కామెడీ, పూరి మార్క్ డైరెక్షన్.. ఇలా దేశముదురు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. చక్రి పాటలు ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాయి. అప్పటివరకు ఎక్కువగా ప్రేమకథల్లో నటించిన అల్లు అర్జున్ కు దేశముదురు సినిమా మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది. స్టార్ హీరోగా క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా కు సంబంధించి ఒక విషయం చాలా మందికి తెలియదు. అదేంటంటే.. దేశముదురు సినిమాకు హీరోగా మొదట అల్లు అర్జున్ ను అనుకోలేదట. ఇంకో హీరోను అనుకున్నారట. అతనికి కథ కూడా నచ్చిందట. అయితే నన్ తో లవ్ ట్రాక్, పెళ్లి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందంటూ రిజెక్ట్ చేశాడట. దీంతో అల్లు అర్జున్ చేతికి దేశ ముదురు సినిమా వచ్చిందట. ఇంతకీ ఈ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్న హీరో మరెవరో కాదు అక్కినేని సుమంత్.
అల్లు అర్జున్ కంటే ముందు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సుమంత్ కు దేశ ముదురు కథ వినిపించాడట. సుమంత్ కూడా కథ చాలా బాగుందని చెప్పాడట. అయితే ఈ సినిమా కథ తనకు సూట్ కాదని, మరీ ముఖ్యంగా నన్ తో లవ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందన్నాడట. దీంతో డైరెక్టర్ పూరీ బన్నీకి దేశ ముదురు స్క్రిప్ట్ వినిపించారట. కథ విన్న అల్లు అర్జున్ వెంటనే ఒకే చెప్పాడట. అలా దేశముదురు సినిమా పట్టాలెక్కిందట. ఇక ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పూరీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








