Samantha : సమంత గ్లామర్ డోస్ పెంచడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే

పొరిగింటి పుల్ల కూర యమా రుచి అన్నే సామెత వైన్ ఉంటారు. ఇప్పుడు ఈ సామెతను నమ్ముకుంటున్నారు కొంతమంది సౌత్ హీరోయిన్స్. సౌత్ లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ తెచ్చుకొని మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు.

Samantha : సమంత గ్లామర్ డోస్ పెంచడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే
Samnatha
Follow us

|

Updated on: Jun 26, 2022 | 3:16 PM

పొరిగింటి పుల్ల కూర యమా రుచి అనే సామెత వినే ఉంటారు. ఇప్పుడు ఈ సామెతను నమ్ముకుంటున్నారు కొంతమంది సౌత్ హీరోయిన్స్. సౌత్ లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ తెచ్చుకొని మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. అక్కడ స్టార్ హీరోల సరసన ఛాన్స్ లో దక్కించుకొని పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ  కోవలోనే.. క్రేజీ హీరోయిన్ సమంత కూడా అటుగా అడుగులు వేస్తోంది. ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత(Samantha).. తొలి సినిమాతోనే అందరినీ మాయలో పడేసింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు సినిమా ఈ అమ్మడు కెరీర్ కు గట్టి మైలేజ్ ఇచ్చింది. అక్కడి నుంచి సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ ఈ చిన్నది బిజీ హీరోయిన్ అయిపోయింది.

ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత ఆచి తూచి సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా సామ్, చైతన్య విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. కారణం తెలియలేదు కానీ ఈ ఇద్దరు విడిపోవడంతో అభిమానులు చాలా డిస్సపాయింట్ అయ్యారు. అయితే విడాకుల తర్వాత సమంత గ్లామర్ షో పెంచింది. ఆమె ఫోటో షూట్లు, సోషల్ మీడియా చెక్ చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. అయితే సమంత స్కిన్ షో పెంచడానికి కారణం ఏంటి..? అని అంతా అనుకుంటున్నారు అయితే దీనిపై ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చెక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లో ఆఫర్లు కోసమే సమంత స్కిన్ షో చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించిన సామ్ ఆ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలు, సిరీస్ లలో కూడా ఆఫర్లు అందుకుంటుందని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ జనాలను ఆకట్టుకోవడం కోసం, అక్కడి ఆఫర్లు కోసమే సమంత స్కిన్ షో చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ మీడియాలోనూ సమంత నిత్యం నానుతూ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..