Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kashmir Files: ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు యూకే ప్రశంసలు.. ఎల్లలు దాటిన కీర్తి..

‘ ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, ఆయన భార్య పల్లవి జోషి.. ప్రస్తుతం ‘ హ్యూమానిటీ టూర్’ లో ప్రపంచ పర్యటన చేస్తున్నారు. ఐతే తాజాగా దర్శకుడు వివేక్‌ అగ్నహోత్రి ఈ సినిమాను యూకే పార్లమెంటులో ప్రదర్శించారు. నాటి కాశ్మీర్..

The Kashmir Files: ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు యూకే ప్రశంసలు.. ఎల్లలు దాటిన కీర్తి..
Vivek Agnihotri
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2022 | 2:22 PM

The Kashmir Files: ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి, ఆయన భార్య పల్లవి జోషి.. ప్రస్తుతం ‘ హ్యూమానిటీ టూర్’ లో ప్రపంచ పర్యటన చేస్తున్నారు. ఐతే తాజాగా దర్శకుడు వివేక్‌ అగ్నహోత్రి ఈ సినిమాను యూకే పార్లమెంటులో ప్రదర్శించారు. నాటి కాశ్మీర్ ఊచకోతలో మృతి చెందిన వారి సంఖ్యను చూపడంతోపాటు మానవత్వం కోసం ఆయన చేసిన కృషిని యూకే పార్లమెంటు సభ్యులు ప్రశంసించారు. ఎంపీ సామ్ తారీ (లేబర్ పార్టీ), థెరిసా విలియర్స్ (కన్సర్వేటివ్ పార్టీ), లార్డ్ నవనీత్ ఢోలాకియా (లిబరల్ డెమొక్రాట్), వీరేంద్ర శర్మ (లేబర్ పార్టీ), నవేందు మిశ్రా (లేబర్ పార్టీ) సహా పలువురు నాయకులు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ప్రశంశల్లో ముంచెత్తారు. ఈ టూర్‌లో భాగంగా నెహ్రూ సెంటర్ లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఇంపీరియల్ కాలేజీ, ఎడిన్‌బర్గ్, లయన్స్ క్లబ్ బర్మింగ్‌హామ్, స్కాటిష్ జ్యూయిష్ హెరిటేజ్ సెంటర్, స్కాట్లాండ్, గ్లాస్గో, స్కాట్లాండ్, యునైటెడ్ పార్లమెంట్, స్కాట్లాండ్, గ్లాస్గో, స్కాట్లాండ్‌లలో వివేక్ అగ్నిహేత్రి దంపతులు ఈ సినిమా గురించి మాట్లాడారు.

కాగా ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. కాశ్మీర్‌లో ముష్కరులు, కాశ్మీరీ హిందువులు, పండితుల ఊచకోతకు సంబంధించిన కథనాన్ని రెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించాడు. 1990లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాలను రూపొందించాడు. అంతేకాకుండా ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్నులు మినహాయించడం, అధికారులకు సినిమా చూసేందుకు సెలవులు కూడా ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దేశాన్ని విభజించే కుట్రలో భాగంగా ఈ సినిమాను చిత్రించినట్లు ప్రతి పక్షాలు విరుచుకు పడ్డాయి.