AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika mandanna: గుడ్ బై చెప్పడం అస్సలు ఇష్టం లేదంటున్న రష్మిక.. నేషనల్ క్రష్ ఆసక్తికర పోస్ట్ ..

సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసకుపోతుంది. కేవలం తెలుగులో కాదు.. తమిళం, హిందీలోనూ ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుతుంది.

Rashmika mandanna: గుడ్ బై చెప్పడం అస్సలు ఇష్టం లేదంటున్న రష్మిక.. నేషనల్ క్రష్ ఆసక్తికర పోస్ట్ ..
Rashmika
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2022 | 1:58 PM

Share

ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో యమ క్రేజ్ సొంతం చేసుకుంది కన్నడ సోయగం రష్మిక.. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో మెప్పించింది ఈ చిన్నది. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉందన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు వరుస ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.

సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసకుపోతుంది. కేవలం తెలుగులో కాదు.. తమిళం, హిందీలోనూ ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న వరిసు సినిమాలో నటిస్తుంది. అలాగే హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన మిషన్ మజ్ను సినిమా చేసింది. ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇదే కాకుండా.. హిందీలో గుడ్ బై సినిమాలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది.. ఈ విషయాన్ని రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. చిత్రయూనిట్ తో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.. నా బేబీ గుడ్ బై కు గుడ్ బై చెప్పడం ఇష్టం లేదు. రెండేళ్లుగా కరోనాతోపాటు ఏదీ కూడా మమ్మల్ని అడ్డుకోలేదు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సార్ తో కలిసి పనిచేసే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను..

ప్రపంచంలో ఆయన అత్యుత్తమ మనిషి.. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ వికాస్ బహల్ కృతజ్ఞతలు.. నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకున్నారో ఆ దేవుడికే తెలియాలి.. మీరు గర్వపడేలా ఇందులో నటించానని అనుకుంటున్నాను.. గుడ్ బై ని చూసేందుకు రెడీగా ఉండడి.. నేను ఈ చిత్రాన్ని చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ రాసుకొచ్చింది..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..