Prithviraj Sukumaran: సలార్ సినిమా గురించి ఆ స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్.. ఛాన్స్ వచ్చింది.. కానీ..

సలార్.. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా..దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తోంది.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న

Prithviraj Sukumaran: సలార్ సినిమా గురించి ఆ స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్.. ఛాన్స్ వచ్చింది.. కానీ..
Prithviraj
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 26, 2022 | 7:40 AM

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం కడువా.. ఇప్పటికే మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్ జోడీగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‏గా రాబోతున్న ఈ సినిమా జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.. ఇందులో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్రలో నటించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ప్రస్తుతం చిత్రయూనిట్ హైదరాబాద్‍లో ప్రమోషన్స్‏లో పాల్గొంది.. ఈ సందర్భంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు..

తనకు ముందుగానే సలార్ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం ఛాన్స్ వచ్చిందని.. కానీ డేట్స్ కుదరక చేయాలేనని చెప్పా అన్నారు.. పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. “సలార్ సినిమాలో ఓ కీలకపాత్రలో ఛాన్స్ వచ్చింది.. నిజానికి ఈ మూవీ స్టోరీ నేను రెండేళ్ల క్రితం విన్నాను..నాకు చాలా నచ్చింది..అద్బుతమైన కథ.. నా స్నేహితుడు ప్రశాంత్, హోంబలే ప్రొడక్షన్ నాకు క్లోజ్ కావడంతో వెంటనే ఓకే చెప్పాను.. ఇందులో ప్రభాస్ నటించడం.. అతనితో కలిసి పనిచేయాలని ఉండేది.. కానీ కరోనా ఒక్కసారిగా అన్నింటిని మార్చేసింది.. డేట్స్ కుదరకపోవడంతో నేను చేయలేనని చెప్పాను.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. ఇప్పుడు నాకు డేట్స్ సర్దుబాటు అవుతాయి అనుకుంటున్నాను.. ప్రతిరోజు ప్రశాంత్ ను కలుస్తున్నాను..అన్ని కుదిరితే త్వరలోనే సలార్ సినిమాలో భాగమవుతాను.. నాకు తెలుగు సినిమా చేయాలని ఉంది.. నటించడమే కాదు డైరెక్ట్ కూడా చేస్తాను.. ” అంటూ చెప్పుకొచ్చారు..

సలార్.. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా..దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తోంది.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.