Sai Kiran: మోసం చేశారు.. న్యాయం చేయండి.. పోలీసులను ఆశ్రయించిన ‘నువ్వేకావలి’ హీరో సాయి కిరణ్..
సినీ నటుడు సాయికిరణ్ మోసపోయినట్లు తాజాగా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన దగ్గర అప్పు తీసుకుని మోసం చేశారంటూ సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.
Actor Sai Kiran: నువ్వే కావాలి మూవీ ఫేమ్ సాయి కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే కావాలి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సాయి కిరణ్.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాడు. కాగా.. సినీ నటుడు సాయికిరణ్ మోసపోయినట్లు తాజాగా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన దగ్గర అప్పు తీసుకుని మోసం చేశారంటూ సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. అప్పు తీసుకోవడమే కాకుండా తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. సాయికిరణ్ నాలుగు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాత జాన్‌బాబు, లివింగ్ స్టన్‌లపూ తన దగ్గర రూ.10.6 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారని.. తనకు న్యాయం చేయాలంటూ సాయి కిరణ్ ఫిర్యాదు చేశాడు. పైగా డబ్బులు అడిగితే తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాయికిరణ్ ఫిర్యాదు మేరకు జాన్‌బాబు, లివింగ్ స్టన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. వారిపై 420,406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..